Prabhas America Record : RRR రికార్డ్ లేపేసిన కల్కి.. అమెరికాలో ప్రభాస్ సరికొత్త రికార్డ్.. ఏ హీరోకి లేదుగా..

ఇప్పటివరకు కల్కి సినిమా అమెరికాలో ఏకంగా 14.5 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది.

Prabhas America Record : RRR రికార్డ్ లేపేసిన కల్కి.. అమెరికాలో ప్రభాస్ సరికొత్త రికార్డ్.. ఏ హీరోకి లేదుగా..

Prabhas Creates New Record in America with Kalki 2898AD Movie Collections Breaks RRR Record

Updated On : July 6, 2024 / 8:34 AM IST

Prabhas America Record : ప్రభాస్ కల్కి సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. భారీ హిట్ టాక్ తెచ్చుకొని ఇప్పటికే 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ వారం కూడా ఏ సినీ పరిశ్రమలోనూ పెద్ద సినిమాలు లేకపోవడంతో కల్కి థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇప్పటికే కల్కి సినిమా వారం రోజులకే బోలెడన్ని రికార్డులు సృష్టించింది. ఇక అమెరికాలో అయితే కల్కి రిలీజ్ ముందు నుంచే సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది.

ఇప్పటివరకు కల్కి సినిమా అమెరికాలో ఏకంగా 14.5 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. అమెరికా డిస్ట్రిబ్యూటర్స్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. అంటే దాదాపు మన లెక్కల్లో 115 కోట్లు వసూలు చేసింది. అయితే అమెరికాలో తెలుగు సినిమాలకు మార్కెట్ ఎక్కువే. అక్కడ 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధిస్తేనే గొప్పగా చెప్పుకుంటారు. చాలా తెలుగు సినిమాలు అక్కడ సరికొత్త రికార్డులు సృష్టించాయి కలెక్షన్స్ విషయంలో. అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాల్లో 20 మిలియన్ డాలర్స్ తో బాహుబలి 2 మొదటి స్థానంలో ఉంది.

Also Read : RGV – Nag Ashwin : ఆర్జీవిని నాగ్ అశ్విన్ అంత మాట అనేశాడేంటి..? కల్కిలో ఆర్జీవీ గెస్ట్ అప్పీరెన్స్‌పై ఏమన్నాడంటే..

బాహుబలి 2 తర్వాత RRR సినిమా 14.3 డాలర్స్ తో రెండో ప్లేస్ లో ఉండగా ఇప్పుడు కల్కి సినిమా RRR రికార్డ్ ని బ్రేక్ చేసి 14.5 మిలియన్ డాలర్స్ తో రెండో ప్లేస్ లో నిలిచింది. ఇలాగే కొనసాగితే బాహుబలి 2 రికార్డ్ లేపేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. కల్కి రాకతో ఇప్పటివరకు అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 10 తెలుగు సినిమాల్లో బాహుబలి 2, కల్కి, సలార్, బాహుబలి 1, సాహో.. ఇలా అయిదు సినిమాలు ప్రభాస్ వే ఉండటం విశేషం. ఏ హీరోకి కూడా ఇన్ని సినిమాలు లేకపోవడం గమనార్హం.