Band Melam Glimpse: ‘బ్యాండ్ మేళం’ మూవీ స్పెషల్ గ్లింప్స్.. కోర్ట్ జంట అదరగొట్టేశారు!
బ్యాండ్ మేళం(Band Melam Glimpse) సినిమా నుంచి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు.
Band Melam Valentines Day Special Glimpse released
Band Melam Glimpse: టాలీవుడ్ యంగ్ పెయిర్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బ్యాండ్ మేళం. లవ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు సతీష్ జవ్వాజి తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పిస్తున్న ఈ సినిమాను కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి వాలెంటైన్స్ డే సందర్బంగా బ్యాండ్ మేళం(Band Melam Glimpse) మూవీ స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ హీరో తన ప్రేమ గురించి చెప్పిన ఎమోషనల్ డైలాగ్స్ హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. దీంతో ఈ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక కోర్ట్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత రోషన్, శ్రీదేవి జంటగా వస్తున్న ఈ సినిమా మార్చ్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.
Rashi Singh: గ్లామర్ బ్యూటీ రాశి సింగ్.. బోటులో హాట్ అందాలు కేక.. ఫొటోలు
