Band Melam Valentines Day Special Glimpse released
Band Melam Glimpse: టాలీవుడ్ యంగ్ పెయిర్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బ్యాండ్ మేళం. లవ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు సతీష్ జవ్వాజి తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పిస్తున్న ఈ సినిమాను కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి వాలెంటైన్స్ డే సందర్బంగా బ్యాండ్ మేళం(Band Melam Glimpse) మూవీ స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ హీరో తన ప్రేమ గురించి చెప్పిన ఎమోషనల్ డైలాగ్స్ హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. దీంతో ఈ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక కోర్ట్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత రోషన్, శ్రీదేవి జంటగా వస్తున్న ఈ సినిమా మార్చ్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.
Rashi Singh: గ్లామర్ బ్యూటీ రాశి సింగ్.. బోటులో హాట్ అందాలు కేక.. ఫొటోలు