Jai Hanuman Movie Update Producers wants Ram Charan as Hanuman
Ram Charan : ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో వచ్చిన హనుమాన్ సినిమా ఏ రేంజ్ లో భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. తేజ సజ్జ ముఖ్య పాత్రలో చిన్న సినిమాగా రిలీజయి ఏకంగా 350 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒక మనిషికి ఆంజనేయస్వామి పవర్స్ వస్తే ఎలా ఉంటుంది? ఆంజనేయస్వామి తిరిగొస్తే ఎలా ఉంటుంది అని ఆసక్తికరమైన కథతో తెరకెక్కించారు.
అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో హనుమంతుడు వస్తాడు. అలాగే జై హనుమాన్ అని సీక్వెల్ కూడా అనౌన్స్ చేసారు. జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్ర ఉంటుందని కూడా చెప్పారు. దీంతో హనుమంతుడి పాత్ర ఏ హీరో చేస్తారు అని అంతా చర్చించుకున్నారు. హనుమాన్ సినిమా క్లైమాక్స్ లో హనుమంతుడి కళ్ళు చూసి రానా లేదా చిరంజీవి హనుమాన్ పాత్ర చేసి ఉంటారని అనుకున్నారు.
Also Read : Comedian Satya : కమెడియన్ సత్య ‘అమృతం’ సీరియల్ లో ఉన్నాడని తెలుసా?
అయితే తాజాగా హనుమాన్ నిర్మాత చైతన్య డార్లింగ్ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. హనుమాన్ పాత్రకి ఇంకా ఎవర్ని అనుకోలేదు. మేమైతే రామ్ చరణ్ కానీ, చిరంజీవి గారు కానీ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. వాళ్ళని అప్రోచ్ అవుతాము. కానీ ఆ టైంకి హనుమంతుడి పాత్ర ఎవరు చేస్తారు అనేది ఆ దేవుడే నిర్ణయిస్తారు. ప్రస్తుతానికి జై హనుమాన్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సినిమా రావడానికి టైం పడుతుంది అని తెలిపారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారగా మెగా అభిమానులు ఇది నిజమయి చరణ్ కానీ చిరంజీవి కానీ హనుమంతుడి పాత్ర చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. మరి జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్ర ఎవరు చేస్తారో చూడాలి.