Comedian Satya : కమెడియన్ సత్య ‘అమృతం’ సీరియల్ లో ఉన్నాడని తెలుసా?
అందరి ఫేవరేట్ సీరియల్ అమృతంలో కూడా సత్య నటించాడు.

Do You Know Comedian Satya played a role in Amrutham Serial Details Here
Comedian Satya : కమెడియన్ సత్య ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తన కామెడీతో తాను చేసిన ప్రతి సినిమాలో ప్రతి పాత్రతో ప్రేక్షకులని నవ్విస్తున్నాడు. ఒకప్పుడు సునీల్ చేసే రేంజ్ కామెడీ ఇప్పుడు సత్య చేసి నవ్విస్తున్నాడు. ప్రస్తుతం సత్య వరుస సినిమాలతో కమెడియన్ గా దూసుకుపోతున్నాడు. అయితే సత్య దాదాపు 15 ఏళ్లుగా సినిమాల్లో ఉన్నాడు. కానీ 2011లో పిల్ల జమిందార్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు.
అంతకంటే ముందే కొన్ని సినిమాలు, సీరియల్స్ లో నటించాడు సత్య. అయితే అందరి ఫేవరేట్ సీరియల్ అమృతంలో కూడా సత్య నటించాడు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అమృతం సీరియల్ అంటే అందరికి ఫేవరేట్. అప్పట్లో అది సూపర్ హిట్ కామెడీ సీరియల్ అని తెలిసిందే. 90s కిడ్స్ కి అయితే ప్రతి ఆదివారం రాత్రి అమృతం సీరియల్ చూడకుండా పడుకునే వారు కాదు. ఇప్పటికి అమృతం సీరియల్ చూసి హ్యాపీగా నవ్వుకోవచ్చు.
అయితే అమృతం సీరియల్ లో కమెడియన్ సత్య నటించాడు. UN happy days అనే ఎపిసోడ్ పార్ట్ 1, పార్ట్ 2లో సత్య కనిపిస్తాడు. ఈ ఎపిసోడ్ లో సరదాగా బుక్ క్రికెట్ ఆడతారు. అందులో కూడా సత్య ఉంటాడు. అప్పాజీ పాత్రకు సీనియర్ పాత్రలో సత్య కనిపిస్తాడు. అప్పుడు కూడా తన హావభావాలతో సత్య నవ్వించాడు. ప్రస్తుతం అమృతం సీరియల్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కొన్ని ఎపిసోడ్స్ యూట్యూబ్ లో కూడా ఉన్నాయి. UN happy days అని ఎపిసోడ్ వెతికి చూస్తే అందులో సత్య కనిపిస్తాడు. అయితే అప్పట్లో కొంచెం సన్నగా కూడా ఉన్నాడు సత్య.