Savitri Missamma : సావిత్రి ‘మిస్సమ్మ’ సినిమాకు ఫస్ట్ అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా? లావణ్య త్రిపాఠి ఆ టైటిల్ వాడేసిందిగా..

సావిత్రి మిస్సమ్మ సినిమాకు ముందు అనుకున్న టైటిల్ మిస్సమ్మ కాదు.

Savitri Missamma : సావిత్రి ‘మిస్సమ్మ’ సినిమాకు ఫస్ట్ అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా? లావణ్య త్రిపాఠి ఆ టైటిల్ వాడేసిందిగా..

Do You Know Savitri Missamma Movie First Title Lavanya Tripathi entry with that Title

Updated On : July 6, 2024 / 11:20 AM IST

Savitri Missamma : మహానటి సావిత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె చేసిన ప్రతి సినిమాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సావిత్రి కెరీర్లో గొప్పగా నిలిచిన కొన్ని సినిమాల్లో మిస్సమ్మ ఒకటి. ఈ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్, జమున లాంటి స్టార్స్ తో సావిత్రి నటించి టైటిల్ పాత్రకు న్యాయం చేసి ఆ పాత్ర ఎప్పటికి గుర్తుండిపోయేలా చేసారు. నాగిరెడ్డి, చక్రపాణి నిర్మాణంలో LV ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్సమ్మ సినిమా ఎప్పటికి నిలిచిపోతుంది.

అయితే మిస్సమ్మ సినిమాకు ముందు అనుకున్న టైటిల్ మిస్సమ్మ కాదు. గతంలో డైరెక్టర్ హను రాఘవపూడి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపాడు. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు హను రాఘవపూడి. ఈ సినిమాతోనే లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

Also Read : సంవత్సరం గ్యాప్‌లో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ చూపించేసిన ప్రభాస్.. రెబల్ స్టార్ ఒక్కడికే సాధ్యం..

గతంలో ఒక ఇంటర్వ్యూలో హను రాఘవపూడి మాట్లాడుతూ.. అందాల రాక్షసి సినిమాలో లావణ్య పాత్రని గీతాంజలిని సినిమా నుంచి ప్రేరణగా తీసుకొని రాసానని అంటున్నారు. అది అబద్దం. నేను ఆ పాత్రని మిస్సమ్మ సినిమాలో సావిత్రి గారి పాత్ర నుంచి తీసుకొని రాసుకున్నాను. ఆ పాత్రలో ఉండే అమాయకత్వం, కోపం ఇక్కడ లావణ్య పాత్రలో కూడా ఉంటాయి. టైటిల్ కూడా అక్కడనుంచే తీసుకున్నాను. మిస్సమ్మ సినిమాకు ముందు అనుకున్న టైటిల్ అందాల రాక్షసి. ఆ టైటిల్ నేను పెట్టుకున్నాను అని తెలిపారు.