Traffic Restrictions : బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు.. ఎప్పటి వరకంటే?

అమీర్‌పేట, బేగంపేట నుంచి వస్తున్న వాహనాలను ఎస్‌ఆర్‌నగర్‌ ట్రాఫిక్‌ పోలీస్ స్టేషన్ మీదుగా సోనీ వైన్స్‌, ఉమేష్చంద్ర విగ్రహం మీదుగా...

Balkampet Ellamma temple

Traffic Restrictions In Hyderabad : బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కల్యాణం పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ డైవెర్షన్స్ చేసినట్లు ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రధాన రోడ్డును ఇరువైపుల మూసివేసి వాహనాలను దారి మళ్ళిస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు శనివారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఈనెల 10వ తేదీ సాయంత్రం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రయాణికులు, స్థానిక ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలకు సహకరించాలని పోలీసులు కోరారు.

Also Read : Hathras stampede : తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా.. హత్రాస్ ఘటనపై ఏమన్నారంటే?

అమీర్‌పేట, బేగంపేట నుంచి వస్తున్న వాహనాలను ఎస్‌ఆర్‌నగర్‌ ట్రాఫిక్‌ పోలీస్ స్టేషన్ మీదుగా సోనీ వైన్స్‌, ఉమేష్చంద్ర విగ్రహం మీదుగా పంపిస్తున్నారు.
సనత్‌నగర్‌, ఫత్తేనగర్‌, బేగంపేట బైపాస్‌ రోడ్డు నుంచివస్తున్న వాహనాలను సిక్స్‌ఫీట్‌ రోడ్డు నుంచి, బల్కంపేట బతుకమ్మ చౌరస్తా మీదుగా ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట మీదుగా తరలిస్తున్నారు.