Leo Audio Function Cancellled : ‘లియో’ ఆడియో లాంచ్ క్యాన్సిల్.. రాజకీయ ఒత్తిడే కారణమా?

తలపతి విజయ్ 'లియో' సినిమా ఆడియో లాంచ్ క్యాన్సిల్ అయ్యింది. సెప్టెంబర్ 30 న ఆడియో లాంచ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్త. అందుకు గల కారణాలను మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు.

Leo Audio Function Cancellled

Leo Audio Function Cancellled : తలపతి విజయ్ ‘లియో’ ఆడియో లాంచ్ క్యాన్సిల్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 30 న చెన్నైలో జరగాల్సిన ఈ వేడుకను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసారు. అందుకు గల కారణాలను ట్విట్టర్‌లో వెల్లడించారు.

Leo Movie : క్యాప్షన్స్‌తో సినిమా కథని చెప్పేస్తున్న ‘లియో’..

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో తలపతి విజయ్ నటిస్తున్న ‘లియో’ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 19 న థియేటర్లలో విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్‌కి ముందు నిర్మాతలు సెప్టెంబర్ 30 న ఆడియో లాంచ్ ఉందని అనౌన్స్ చేసారు. తాజాగా ప్రొడక్షన్ హౌస్, సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈ సినిమా ఆడియో లాంచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆడియో లాంచ్ రద్దు చేయడానికి గల కారణాలను వివరిస్తూ పోస్ట్ పెట్టింది.

లియో ఆడియో ఫంక్షన్‌కి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉన్నందున అంతమందికి ఎంట్రీ పాస్‌లు ఇవ్వడం కష్టమని, భద్రతా కారణాల వల్ల రద్దు చేయాలని నిర్ణయించుకున్నామని లియో మేకర్స్ ట్వీట్‌లో వెల్లడించారు. సినిమా అప్‌డేట్లను ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటామని.. అందరూ భావిస్తున్నట్లు తమ మీద ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదని స్పష్టం చేసారు. వీరి ట్వీట్ చూసిన విజయ్ ఫ్యాన్స్ నిరుత్సాహ పడ్డారు. విజయ్ స్పీచ్‌ను మిస్ అవుతున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు.

LEO : విదేశాల్లో ‘లియో’ సంచ‌ల‌నం.. రిలీజ్‌కు ముందే బాక్సాఫీసు రికార్డు

ఇటీవల చెన్నైలో రెహమాన్ మ్యూజిక్ కన్సర్ట్ విషయంలో వివాదం సంగతి తెలిసిందే. కెపాసిటీని మించి టిక్కెట్లు అమ్మడం.. తొక్కిసలాట జరగడంతో ఈ కాన్సర్ట్ విమర్శల పాలైంది. దీనిని దృష్టిలో పెట్టుకుని లియో నిర్మాతలు ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేసుకుని ఉండవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు