అనుకున్నదే అయింది.. ఓటీటీలో ‘వి’..

  • Publish Date - August 20, 2020 / 02:15 PM IST

V Movie On Prime: నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందించిన థ్రిల్లర్.. ‘వి’. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్నట్లు అమేజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమా విడుదల కాబోతోంది. సెప్టెంబర్ 5 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. నాని, దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.



విడుదలకు ముందే ఎన్నో అంచనాలు రేకెత్తించిన ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే లాక్‌డౌన్ కారణంగా విడుదల కాలేదు. గతంలో ఓటీటీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా నిర్మాత దిల్ రాజు మరో ఆలోచన లేకుండా తిరస్కరించారు.‘వి’ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పట్లో అది సాధ్యపడదనే క్లారిటీ రావడంతో ఓటీటీ వేదికగా విడుదల చేయడానికి సిద్ధపడ్డారు.



నాని నటించిన 25వ చిత్రం ఇది. ఈ 12 ఏళ్లుగా థియేటర్స్‌లోకి వచ్చాను. ఈ సారి మీకు థ్యాంక్స్ చెప్పడానికి మీ ఇంటికొస్తున్నాను. కాస్త Excited గానూ కొంచెం Nervous గానూ ఉంది. థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత ‘టక్ జగదీష్’ చిత్రంతో కచ్చితంగా మీముందుకొస్తాను అంటూ నాని నోట్ రిలీజ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు