Kushi : రెండు రోజులోనే అమెరికాలో ఆ రికార్డుని అందుకున్న ఖుషి..

విజయ్ దేవరకొండ ఇమేజ్ కి సమంత స్టార్‌డమ్ యాడ్ అవ్వడంతో కేవలం రెండు రోజులోనే అమెరికాలో ఖుషి సినిమా..

Vijay Deverakonda Samantha Kushi collections at USA

Kushi : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) కాంబినేషన్ లో శివ నిర్వాణ(Shiva Nirvana) తెరకెక్కించిన చిత్రం ‘ఖుషి’. లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సెప్టెంబర్ 1న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి. మొదటి రోజే ఈ చిత్రం రూ.30 కోట్ల గ్రాస్ ని అందుకొని విజయ్ దేవరకొండ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్ గా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కేవలం ఇండియాలోనే కాదు ఓవర్ సీస్ లో కూడా ఈ మూవీ రికార్డు కలెక్షన్స్ ని సాధిస్తుంది.

Gadar 2 : గదర్ 2 సినిమా 500 కోట్ల సక్సెస్ పార్టీ.. సల్మాన్, షారుఖ్‌తో సహా తరలి వచ్చిన బాలీవుడ్..

విజయ్ దేవరకొండ ఇమేజ్ కి సమంత స్టార్‌డమ్ యాడ్ అవ్వడంతో కేవలం రెండు రోజులోనే అమెరికాలో 1 మిలియన్ మార్క్ ని అందుకుంది. గతంలో విజయ్ బ్లాక్ బస్టర్స్ మూవీ ‘అర్జున్ రెడ్డి’, గీత గోవిందం సినిమాలు ఈ మిలియన్ మార్క్ ని అందుకున్నాయి. ఆ తరువాత మళ్ళీ ఇన్నాళ్లకి విజయ్ ఆ మార్క్ ని టచ్ చేశాడు. ఇక సమంత విషయానికి వస్తే.. ఈ మూవీతో ఆమె నటించిన మొత్తం 17 సినిమాలు అమెరికాలో 1 మిలియన్ మార్క్ ని అందుకున్నాయి. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు సందడి చేస్తున్నారు. ఇక వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రెండు రోజుల్లో రూ.51 గ్రాస్ ని అందుకుంది. దాదాపు 25 కోట్ల షేర్ అందుకున్నట్లే.

Ram Charan : గేమ్ ఛేంజర్ సినిమా అప్డేట్.. చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యూట్యూబ్ స్టార్.. ఇంకో యువ హీరో కూడా..

ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 55 కోట్ల షేర్ సాదించాలి. అంటే సుమారు 110 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాలి. మరి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అందుకొని బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుంటుందా? లేదా? చూడాలి. కాగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. హేశం అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.

 

ట్రెండింగ్ వార్తలు