Yashoda: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న యశోద..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “యశోద”. ఈ సినిమా ట్రైలర్ ని టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ రిలీజ్ చేయగా, ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా సెన్సార్ పనులు...

Yashoda:  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “యశోద”. ఈ సినిమాలో సమంత ప్రెగ్నెంట్ లేడీగా నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ని టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ రిలీజ్ చేయగా, ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక సినిమాలోని సామ్ యాక్షన్ సీక్వెన్స్ మూవీకే హైలైట్ కానున్నాయి అని తెలుస్తుంది.

Yashoda: “యశోద” అంటే ఎవరో తెలుసుగా.. కృష్ణ పరమాత్ముడు తల్లి.. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ అదరగొట్టిన సమంత..

సరోగసి కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో.. పిల్లలు కనలేని మరియు అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అవ్వాలనుకునే కొందరు సెలెబ్రెటీస్ కోసం ఒక సంస్థ పనిచేస్తూ ఉంటుంది. అయితే ఆ సంస్థలో ఏదో తప్పు జరుగుతుంది అని తెలుసుకున్న సమంత.. వాటిని బయటపెట్టే క్రమంలో సమంత ఎదురుకున్న సన్నివేశాలని.. యాక్షన్ అండ్ త్రిల్లింగ్ గా తెరకెక్కించారు.

ఇక ఈ సినిమా సెన్సార్ పనులు నేడు ముగించుకుంది. U/A సర్టిఫికెట్ అందుకున్న ఈ మూవీ నవంబర్ 11న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతుంది. తమిళ డైరెక్టర్స్ హరి-హరన్ లు దర్శకత్వం వహిస్తున్నారు. ఉన్ని ముకుందన్, మురళి శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్ వంటి నటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. మరి ఈ సినిమా సామ్ కి ఎంతటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు