Bombay HC: అత్యాచార నిందితుడికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు.. ఏడాదిలోపు బాధితురాలిని పెళ్లి చేసుకోవాలంటూ ఆదేశం

తాను గర్భవతినని తెలిసిన అనంతరం నుంచి తనకు ఆ వ్యక్తి దూరంగా ఉంటున్నాడట. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ వ్యక్తిని ఫిబ్రవరి 2020లో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తన గర్భం గురించి చెప్పగానే అతడు ఆమెను పక్కన పెట్టడం ప్రారంభించాడు. తన గర్భం గురించి ఇంట్లో తెలుస్తుందనే భయంతో ఆమె ఇంట్లో నుంచి బయటికి వచ్చింది. 2020 జనవరి 27న ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది

Bombay HC: అత్యాచారం కేసులో అరెస్టైన ఒక నిందితుడికి బాంబే హైకోర్టు తాజా బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఇస్తూనే బాధితురాలిని ఏడాదిలోగా పెళ్లి చేసుకోవాలంటూ ఆదేశాలు కూడా ఇచ్చింది. అయితే ప్రస్తుతం బాధితురాలు అందుబాటులో లేకపోవడంతో ఆమె ఏడాదిలోపు కనిపిస్తే.. తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాల్సిందేనని తీర్పు చెప్పింది. సరదు వ్యక్తి (26)తో ఒక యువతి (22) పరస్పర అంగీకారంతో 2018 నుంచి రిలేషన్‫‭షిప్‭లో ఉన్నామపి. ఈ విషయం ఇద్దరి వైపు కుటుంబాలకు తెలుసని, వారి నుంచి ఎలాంటి అభ్యంతరం లేదని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

అయితే తాను గర్భవతినని తెలిసిన అనంతరం నుంచి తనకు ఆ వ్యక్తి దూరంగా ఉంటున్నాడట. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ వ్యక్తిని ఫిబ్రవరి 2020లో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తన గర్భం గురించి చెప్పగానే అతడు ఆమెను పక్కన పెట్టడం ప్రారంభించాడు. తన గర్భం గురించి ఇంట్లో తెలుస్తుందనే భయంతో ఆమె ఇంట్లో నుంచి బయటికి వచ్చింది. 2020 జనవరి 27న ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కానీ, మూడు రోజులకే అంటే జనవరి 30న ఆ బిడ్డను ఒక భవనం వద్ద వదిలేసి వెళ్లింది. ఈ విషయమై ఆమెపై కేసు నమోదైంది.

అయితే, ఈ కారణంతోనే ఆమె తన విషయంలో పోరాటం కోసం న్యాయవ్యవస్థ నుంచి దూరంగా పక్కకు తప్పుకుందేమోనని జస్టిస్ డాంగ్రే తాజా తీర్పులో అభిప్రాయపడ్డారు. ఇకపోతే, బాధితురాలిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించడంతో సదరు వ్యక్తికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఏడాదిలోపు బాధితురాలిని గుర్తించి పెళ్లి చేసుకోవాలని ఆదేశించింది. అలా అని ఈ ఆదేశం ఏడాది కాలానికే సరిపెట్టుకోవద్దని హెచ్చరించింది. బెయిల్ ఇస్తూ 25,000 రూపాయల బాండ్‭ను కోర్టు తీసుకుంది.

Andheri East By-Election: శివసేనకు పరోక్ష మద్దతు.. అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నిక నుంచి తప్పుకున్న బీజేపీ

ట్రెండింగ్ వార్తలు