మాస్క్ కట్టుకోకుండా సమావేశంలో పాల్గొన్న బీజేపీ ఎంపీకి జరిమానా

  • Publish Date - June 5, 2020 / 11:15 AM IST

అసలే కరోనా..ముట్టుకోకున్నా అంటుకుంటోంది. ముఖానికి మాస్క్ లు..శానిటైజర్లతో కడుక్కుంటూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పాల్సిన ప్రజాప్రతినిథులు కూడా ఆ నిబంధల్ని పాటించట్లేదు. అది నిర్లక్ష్యమో..లేక మాకేంటి మేం నాయకులం అనుకుంటారో ఏమో గానీ మాస్క్ లు కట్టుకోని నాయకుల గురించి వింటున్నాం.

అదిగో అటువంటి నాయకుడే ఈ బీజేపీ ఎంపీ. ఆ మాత్రం ఉండాలనుకున్నారో ఏమో..మాస్క్ కట్టుకోకుండా సమావేశానికి వచ్చారు బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి.  ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. కరోనా నిబంధనల్లో మరొకటైన  సామాజిక దూరం కూడా పాటించలేదు సదరు ఎంపీగారు. ఎంపీ అపరాజిత సారంగితోపాటు సమావేశంలో మరో 20 మంది కూడా పాల్గొన్నారు. 

దీంతో సదరు ఎంపీతో పాటు బీజేపీ సభ్యులకు రూ.300లు జరిమానా విధించారు.దీనిపై భువనేశ్వర్ డిప్యూటీ పోలీసు కమిషనర్ మాట్లాడుతూ..ఎంపీ అపరాజితా సారంగితో పాటు సమావేశంలో పాల్గొన్నవారందరికి  జరిమానా విధించామని తెలిపారు. మాజీ అధికారిణి అయిన అపరాజిత భౌతిక దూరం పాటించకుండా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టడంతో.. అవి వైరల్ గా మారటంతో అవి మా దృష్టికి వచ్చాయని దీంతో వారికి జరిమానా వేశామని తెలిపారు.

పోలీసులు వేసిన జరిమానా విషయంలో అపరాజిత కూడా స్పందించారు. కరోనా నిబంధనలను గౌరవిస్తూ తాను జరిమానా చెల్లించానని ట్వీట్ చేశారు. కాగా, భౌతిక దూరం నిబంధనలు ఉల్లంఘించిన ఎంపీ అపరాజితపై ఓ సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం.

 

ట్రెండింగ్ వార్తలు