MiG-21 Squadron: మిగ్-21 విమానాలకు వీడ్కోలు చెప్పనున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. ఈ నెల 30తో ఒక స్క్వాడ్రన్ ముగింపు

ఇంతకాలం భారత సైన్యంలో సేవలందించిన మిగ్-21 యుద్ధ విమానాలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్వస్తి చెప్పనుంది. నాలుగు స్క్వాడ్రన్‌లలో ఒక స్క్వాడ్రన్ విమానాలకు ఈ నెల 30న వీడ్కోలు చెప్పనున్నారు. ప్రస్తుతం మన సైన్యంలో 70 మిగ్-21 విమానాలున్నాయి.

MiG-21 Squadron: ఇంతకాలం భారత వైమానిక దళంలో సేవలందించిన మిగ్-21 యుద్ధ విమానాలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీడ్కోలు చెప్పనుంది. శ్రీనగర్‌లోని 51 స్క్వాడ్రన్‌కు చెందిన మిగ్-21 విమానాలకు ఈ నెల 30న వీడ్కోలు పలకనుంది ఐఏఎఫ్. ప్రస్తుతం భారత సైన్యం దగ్గర నాలుగు స్క్వాడ్రన్‌లకు చెందిన 70 మిగ్-21 యుద్ధ విమానాలున్నాయి.

Chandigarh University: ఛండీఘడ్ యూనివర్సిటీలో కొనసాగుతున్న నిరసనలు.. అధికారులు అబద్ధాలు చెబుతున్నారంటున్న విద్యార్థులు

వీటిలో ఒక స్క్వాడ్రన్ విమానాలకు ఇప్పుడు వీడ్కోలు చెప్పబోతున్నారు. మిగిలిన మూడు స్క్వాడ్రన్‌లను కూడా 2025 లోపు సైన్యం నుంచి వీడ్కోలు చెబుతారు. ఇవి సోవియట్ కాలానికి చెందిన సింగిల్ ఇంజిన్ విమానాలు. కొన్నేళ్లలో దేశంలో ఎక్కువగా ప్రమాదాలకు గురైన విమానాలు కూడా ఇవే. ఈ విమానాలు కూలిన ఘటనల్లో అనేక మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 2019లో పాక్ భూభాగంలోకి అభినందన్ వర్ధమాన్ మిగ్-21 విమానంలోనే వెళ్లినప్పుడు, అక్కడ విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే.

Bone-chilling video: అమానుషం.. కుక్కను కారుకు కట్టుకుని ఈడ్చుకెళ్లిన డాక్టర్.. వీడియో వైరల్

ఇప్పటివరకు 400 మిగ్-21 విమానాలు ప్రమాదానికి గురైనట్లు అంచనా. 1963 నుంచి ఇప్పటివరకు ఈ ఘటనల్లో 200 మందికిపైగా పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జూన్‌లో రెండు మిగ్-21 విమానాలు కూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు.

 

ట్రెండింగ్ వార్తలు