Weather Report: మార్చి మొదటి వారం నుంచే “మండే ఎండలు”

భారత వాతావరణశాఖ తెలిపిన వివరాలు మేరకు..మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రత అనూహ్యంగా పెరిగింది.

Weather Report: దేశంలోని పలు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. చలి తీవ్రత తగ్గి ఎండలు పెరుగుతున్నాయి. భారత వాతావరణశాఖ తెలిపిన వివరాలు మేరకు..మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రత అనూహ్యంగా పెరిగింది. గత రెండు రోజులుగా రాత్రివేళలోనూ చలి తీవ్రత తగ్గి..గాలిలో తేమ శాతం పెరిగినట్లు IMD వాతావరణ విభాగం తెలిపింది. ఇప్పటికే తెలంగాణలోని హైదరాబాద్, జహీరాబాద్ సహా మహారాష్ట్రలోని షోలాపూర్, నాందేడ్ పరిసర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు మేర పెరిగినట్లు వాతావరణశాఖ తెలిపింది. హైదరాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదు కాగా గరిష్టంగా 33-34 డిగ్రీలకు చేరుకుంది. ఇక మార్చి మొదటి వారం నుంచే దేశంలో ఎండల తీవ్రత పెరగనున్నట్లు IMD అంచనా వేసింది.

Also read: India Stock Market : ఉక్రెయిన్ -రష్యా ఎఫెక్ట్, భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

సాధారణంగా ఫిబ్రవరి – మార్చి నెలల మధ్య పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలుగానూ, రాత్రి ఉష్ణోగ్రతలు 19-20 డిగ్రీలుగానూ నమోదు అయ్యేవి. అయితే ఈసారి..తక్కువ ఎత్తులో వీస్తున్న ఉత్తర-వాయువ్య గాలుల కారణంగా వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈప్రభావంతో రాత్రిళ్ళు కొంత ఉక్కపోతగానూ.. పగలు ఎండ తీవ్రత అధికంగానూ ఉండనుంది. ఈ ఏడాది ఏప్రిల్ మే నెలల్లో ఉష్ణోగ్రతలు సాధారణంగానే(సరాసరిగా) ఉంటాయని IMD అంచనా వేసింది.

Also read: India Covid : భారత్‌‌‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

ట్రెండింగ్ వార్తలు