INDIA 3rd Meeting: కాంగ్రెస్ ఒత్తిడికి బిహార్ నేతలు తలొగ్గారా? ముంబై సమావేశానికి ముందు నితీశ్, తేజశ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు

బెంగళూరులో జరిగిన రెండవ దఫా సమావేశాల నుంచి నితీశ్, తేజశ్వీ అర్థాంతరంగా వెళ్లిపోయారు. సమావేశానికి ముందే నితీశ్ కు వ్యతిరేకంగా బెంగళూరులో ఫ్లెక్సీలు వెలిశాయి. అవి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సమీపంలో

Nitish Kumar: విపక్షాల కూటమి ‘ఇండియా’ మూడవ సమావేశంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరగనుంది. ఇంతకు ముందు పాట్నా, బెంగళూరులలో రెండుసార్లు ఈ సమావేశాలు జరిగాయి. మొదటి సమావేశంలో విపక్షాల మధ్య కూటమిపై చర్చ జరగ్గా.. రెండవ సమావేశంలో కూటమికి ఇండియా అని పేరు పెట్టారు. ఇక మూడవ సమావేశంలో ఇండియా కన్వీనర్ సహా ఇతర పదవులకు పేర్లు ఖరారవుతాయని జోరుగా చర్చ సాగుతోంది. అయితే ఇండియా కూటమి ఏర్పడడానికి ఆది నుంచి కీలకంగా కృషి చేసిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సహా ఆయన డిప్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Swami Prasad Maurya: హిందూ మతమనేదే లేదు, బ్రాహ్మణిజాన్ని అలా పిలుస్తున్నారు.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్వామి ప్రసాద్ మౌర్య

సోమవారం (ఆగస్టు 28) కన్వీనర్‌ గురించి మీడియా ప్రశ్నించగా తనకు అలాంటి పదవుల మీద ఆసక్తి లేదని తేల్చి చెప్పారు. ‘‘మేం ఏమీ కాదల్చుకోలేదు. ఎప్పటి నుంచో మేం అదే చెబుతున్నాం. మాకు వ్యక్తిగత కోరికలు లేవు. అందరినీ ఏకం చేయాలనుకుంటున్నాం. అందరూ కలిసి పని చేస్తాం. వ్యక్తిగతంగా ఏమీ అవసరం లేదు. మేము అందరి ఆసక్తిని కోరుకుంటున్నాము’’ అని అన్నారు. ఇక తేజశ్వీ యాదవ్ కూడా దాదాపుగా ఇలాగే స్పందించారు. సోమవారం ఓ కార్యక్రమానికి చేరుకున్న నితీశ్ కుమార్‌తో పాటు తేజస్వి యాదవ్ కూడా ఉన్నారు. ప్రజలంతా తీసుకునే నిర్ణయాన్ని అందరూ ఆమోదిస్తారని ఆయన చెప్పారు. అందరం కలిసి పని చేస్తున్నామని, కొన్ని ఎజెండాలపై చర్చలు ఉంటాయని తెలిపారు.

Neeraj Chopra: పాక్ ప్లేయర్‌ పట్ల నీరజ్ చోప్రా ప్రవర్తనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్న నెటిజన్లు .. వీడియో వైరల్

కూటమి ఏర్పాటు ఆలోచన చేసిన మొదటి రోజు నుంచి నితీశ్ ను ప్రధాని అభ్యర్థిగా తేజశ్వీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. నితీశ్ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పనప్పటికీ మనసులో అదే ఉందనేది బహిరంగ చర్చ. వాస్తవానికి బెంగళూరులో జరిగిన రెండవ దఫా సమావేశాల నుంచి నితీశ్, తేజశ్వీ అర్థాంతరంగా వెళ్లిపోయారు. సమావేశానికి ముందే నితీశ్ కు వ్యతిరేకంగా బెంగళూరులో ఫ్లెక్సీలు వెలిశాయి. అవి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సమీపంలో. బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశాలు జరిగాయి. రాహుల్ గాంధీని ముందుకు తీసుకు రావడానికే నితీశ్ మీద కాంగ్రెస్ బురద చల్లిందని బహిరంగ విమర్శలు వచ్చాయి.

PM Race: మొదటిసారి ప్రధాని రేసులో మోదీని దాటేసిన రాహుల్.. సర్వేలో చాలా చిత్రమైన అభిప్రాయం వ్యక్తం చేసిన ప్రజలు

ఇక మూడవ సమావేశానికి నితీశ్ హాజరుపై అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఆయనే తనకు ఏ పదవి మీద ఆసక్తి లేదంటూ వ్యాఖ్యానించడంతో మూడవ సమావేశాలకు హాజరు కావడంతో పాటు ఇండియా కూటమిలోనే కొనసాగుతారనే క్లారిటీ వచ్చేసింది. అయితే దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రెషర్ ఉందని అంటున్నారు. కాంగ్రెస్ ఒత్తిడి మేరకే బిహార్ నేతలు (నితీశ్, తేజశ్వీ) తలొగ్గినట్లు తెలుస్తోంది. మూడో సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబైలో జరగనుంది.

ట్రెండింగ్ వార్తలు