PM Race: మొదటిసారి ప్రధాని రేసులో మోదీని దాటేసిన రాహుల్.. సర్వేలో చాలా చిత్రమైన అభిప్రాయం వ్యక్తం చేసిన ప్రజలు

రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా తాజాగా ఎన్‌డీటీవీ, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్) సంయుక్తంగా సర్వే చేశాయి. మోదీకి సమీపంలో కూడా రాహుల్ ఎప్పుడూ కనిపించలేదు. అలాంటిది మొట్టమొదటిసారి మోదీని దాటేసి ప్రధాని అభ్యర్థి రేసులో రాహుల్ ముందుకు వచ్చారు.

Rahul and Modi: దాదాపు దశాబ్ద కాలంగా నరేంద్రమోదీ, రాహుల్ గాంధీ మధ్య ప్రధానమంత్రి పదవి పోటీ కొనసాగుతోంది. అయితే ఎన్నికలైనా, బయట ప్రజా అభిప్రాయాలైనా, సర్వేలైనా ప్రతీసారి నరేంద్రమోదీయే గెలుచుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి మోదీకి సమీపంలో కూడా రాహుల్ ఎప్పుడూ కనిపించలేదు. అలాంటిది మొట్టమొదటిసారి మోదీని దాటేసి ప్రధాని అభ్యర్థి రేసులో రాహుల్ ముందుకు వచ్చారు. అయితే ఇది కేవలం ఒక అంశంలో మాత్రమే మోదీని రాహుల్ వెనక్కి నెట్టారు.

Nagari YCP : మరోసారి నగరి వైసీపీలో గ్రూప్ విబేధాలు.. మంత్రి రోజా ఫొటో లేకుండా పట్టణంలో ఫ్లెక్సీలు

రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా తాజాగా ఎన్‌డీటీవీ, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్) సంయుక్తంగా సర్వే చేశాయి. ఈ సర్వేలో, ప్రధానమంత్రి పదవికి ఉన్న ఇష్టాలు, అయిష్టాల గురించి ప్రజల అభిప్రాయం తీసుకున్నారు. 2023లో నిర్వహించిన సర్వే కంటే ఈసారి రాహుల్ గాంధీ 4 శాతం ఎక్కువ ప్రజాదరణ పొందారు. ఇక అదే సమయంలో, మునుపటి సర్వే 2019తో పోల్చితే నరేంద్ర మోదీ ప్రజాదరణ 3.5 శాతం తగ్గింది. మొత్తంగా 43 శాతం మంది ప్రజలు ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోదీనే తమ మొదటి ఎంపికగా భావించారు. రాహుల్ ఈ విషయంలో బాగా వెనుకబడే ఉన్నారు.

Swami Prasad Maurya: హిందూ మతమనేదే లేదు, బ్రాహ్మణిజాన్ని అలా పిలుస్తున్నారు.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్వామి ప్రసాద్ మౌర్య

అయితే ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రధాని అభ్యర్థిపై అయిష్టత విషయంలో మోదీపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. రాహుల్ ఈ విషయంలో చాలా సేఫ్ ఉన్నారు. ఈ సర్వే సందర్భంగా రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీల మధ్య ఎవరిని ఎక్కువగా తిరస్కరిస్తారనే ప్రశ్నకు 16 శాతం మంది రాహుల్ గాంధీని వ్యతిరేకించగా, 23 శాతం మంది ప్రజలు ప్రధాని మోదీపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇష్టపడని విషయంలో రాహుల్ గాంధీ కంటే 7 శాతం మంది ప్రజలు ప్రధాని మోదీని తిరస్కరించారు. ఈ ఒక్క విషయంలో మోదీ కంటే రాహుల్ మెరుగ్గా ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు