Odisha : కుమార్తెకు లింగమార్పిడి ఆపరేషన్ చేయించిన ఐపీఎస్ దంపతులు

22 ఏళ్ల కుమార్తెకు లింగమార్పిడి ఆపరేషన్ చేయించారు ఒడిశాకు చెందిన ఐపీఎస్ దంపతులు.

Odisha  : వారు ఐపీఎస్ దంపతులు..వారొక అత్యంత సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారి కుమార్తెకు లింగ మార్పిడి ఆపరేషన్ చేయించాలని నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని అక్షరాలు అమలు చేశారు. ఒడిశాలోని ఐపీఎస్ దంపతులకు చెందిన 22 ఏళ్ల కుమార్తె తల్లిదండ్రుల అనుమతితో విజయవంతంగా లింగమార్పిడి శస్త్రచికిత్స (సెక్స్ రీ అసైన్ మెంట్ సర్జరీ) చేయించుకుంది. ఆపరేషన్ విజయవంతం కావటంతో ఇక వారి కుమార్తెకు సంబంధించి డాక్యుమెంట్లలో జెండర్ మార్చే పనిలో పడ్డారు.

ఇటీవలే ఢిల్లీలో సదరు యువతికి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించారు. అనంతరం డాక్యుమెంట్లు, పాస్ పోర్ట్ లోనూ జెండర్ మార్చే పని చేపట్టారు ఆమె తల్లిదండ్రులు ప్రారంభించారు. దీని గురించి స్పందించటానికి సదరు ఐపీఎస్ దంపతులు గానీ..సర్జరీ చేయించుకున్న యువతి గానీ నిరాకరించారు. ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం బయటకు చెప్పాల్సిన పనిలేదు..మా కుమార్తె ఇష్టంమేరకు ఆమె అభిప్రాయాన్ని గౌరవించి ఆమెకు ఆపరేషయన్ చేయించామని తెలిపారు.

జెండర్ ఆపరేషన్ చేయించుకున్న సదరు యువతి ప్రస్తుతం అమెరికాలో మేనేజ్ మెంట్ స్టడీస్ చేస్తోంది. లింగ మార్పిడి శస్త్ర చికిత్సను ప్లాస్టిక్ సర్జన్, గైనకాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్, సైకియాట్రిస్ట్ తో కూడిన వైద్య బృందం చేస్తుంటుంది. సర్జరీ తర్వాత పూర్తిగా పురుష హార్మోన్లు అభివృద్ధి చెందడానికి రెండేళ్లు పడుతుందని సీనియర్ డాక్టర్ మిశ్రా తెలిపారు.

లింగమార్పిడి చికిత్స చేయించుకున్న వారు జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ (జీఐడీ) ఎదుర్కొంటుంటారని..మహిళ తనను తాను పురుషుడిగా భావిస్తూ..అదే విధంగా ప్రవర్తిరని తెలిపారు. మహిళా క్రోమోజోముల కారణంగా పురుషుల పట్ల ఆకర్షణ కొనసాగుతుంది. అని వెల్లడించారు. పురుషుడిని మహిళగా మార్చడం కంటే.. మహిళను పురుషుడిగా మార్చే సర్జరీ చాలా క్లిష్టమైనదని ప్రొఫెసర్ జయంత్ కుమార్ డాష్ తెలిపారు.

“మేము సాధారణంగా ఒక సంవత్సరంలో ఎనిమిది నుండి తొమ్మిది MTF లింగ మార్పిడి ఆపరేషన్లు చేస్తామని డాక్టర్ డాష్ తెలిపారు. కానీ FTM సెక్స్ మార్పడి చాలా కష్టమని..లింగమార్పిడి రెండు రకాల కేసుల్లోను ఆపరేషన్లు వేర్వేరు దశల్లో నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. గర్భాశయం, అండాశయం, రొమ్ముల తొలగింపు, యోని కుహరం మూసివేయటం..అలాగే మగ ప్రైవేట్ అవయం పునర్నిర్మాణం ప్రక్రియలు ఇలా ఈ ప్రక్రియకు 9నుంచి 10 నెలలు పడుతుంది అని డాక్టర్ జయంత్ కుమార్ డాష్ తెలిపారు. కాగా 2010లో ఒడిశాలోని పూరీకి చెందిన ఒక మహిళా న్యాయవాది లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు