Mission LiFE: పర్యావరణ సమస్యతో పోరాడాలంటే ఆ ఒక్కటి చాలా ముఖ్యం.. ప్రధాని మోదీ

మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ప్రపంచ నేతల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఈ విషయమై భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్, యూకే, మల్దావులుతో సహా పలువురు ప్రపంచ నేతలు అభినందనలు తెలిపారు. తామంతా బాసటగా నిలుస్తామని తెలిపారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ ఒక వీడియో సందేశంలో ''డియర్ నరేంద్ర.. వచ్చే ఏడాది జి20 అధ్యక్ష స్థానంలోకి వస్తున్న ఇండియాతో కలిసి పనిచేయడానికి మేము ఎదురుచూస్తున్నాం'' అని అన్నారు.

Mission LiFE: పర్యావరణ సమస్యపై సమర్థవంతంగా పోరాడాలంటే ఐక్యత సాధించాలని, ఈ పోరాటంలో అదే చాలా కీలమైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. గుజరాత్‭లో నిర్వహించిన ‘మిషన్ లైఫ్’ అనే కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాతావరణ మార్పులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని ఏక్తా నగర్‪‭లో తలపెట్టిన ‘మిషన్ లైఫ్’ అనే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరర్స్ పాల్గొన్నారు.

‘‘పర్యావరణ మార్పుతో తలెత్తే సమస్యల్ని ప్రపంచ మాత్రంగా చూస్తోంది. మంచు కరిగిపోతోంది. నదులు ఇంకిపోతున్నాయి. ఇలాంటి మార్పులను మిషన్ లైఫ్ ఎదుర్కుంటుంది. అయితే ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే.. పర్యావరణ మార్పుతో వచ్చే సమస్యల్ని ఎదుర్కోవాలంటే ముందు మనం ఐక్యత సాధించాలి. ఇదే దీనికి అసలైన మంత్రం’’ అని ప్రధాని మోదీ అన్నారు.

కాగా, మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ప్రపంచ నేతల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఈ విషయమై భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్, యూకే, మల్దావులుతో సహా పలువురు ప్రపంచ నేతలు అభినందనలు తెలిపారు. తామంతా బాసటగా నిలుస్తామని తెలిపారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ ఒక వీడియో సందేశంలో ”డియర్ నరేంద్ర.. వచ్చే ఏడాది జి20 అధ్యక్ష స్థానంలోకి వస్తున్న ఇండియాతో కలిసి పనిచేయడానికి మేము ఎదురుచూస్తున్నాం” అని అన్నారు.

Diwali Holiday: ఈ నెల 24న దీపావళి సెలవు దినం.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన

ట్రెండింగ్ వార్తలు