Seediri Appalaraju : రాష్ట్రానికి మోసం చేసిన వ్యక్తుల్లో చిరంజీవి పేరు చరిత్రలో నిలిచిపోతుంది- మంత్రి సీదిరి అప్పలరాజు

ఎమ్మెల్యే అవుతారనే నమ్మకం ఉంటే నీ నియోజకవర్గం ఏంటో చెప్పు. మేం రాజకీయాలు వదిలి వెళ్లిపోతాం. Seediri Appalaraju - Chiranjeevi

Seediri Appalaraju - Chiranjeevi (Photo : Google)

Seediri Appalaraju – Chiranjeevi : వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచాయి. తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా చిరంజీవి చేసిన కామెంట్స్ చిచ్చు రాజేశాయి. పొలిటికల్ గా మంటలు పుట్టించాయి. చిరంజీవి కామెంట్స్ పై వైసీపీ నేతలు భగ్గుమన్నారు. తీవ్రమైన విమర్శలతో ఎదురుదాడికి దిగారు. తాజాగా మంత్రి సీదిరి అప్పలరాజు మెగాస్టార్ చిరంజీవిపై ఫైర్ అయ్యారు. చిరంజీవి పెద్దాయన గురించి మాటాడాల్సి రావడం బాధాకరం అన్నారు. ఎంపీగా ఉన్న సమయంలో హోదా గురించి నాడు ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోసం చేసిన వ్యక్తుల్లో చిరంజీవి పేరు చరిత్రలో ఉండిపోతుందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.

” రాజకీయాలు విడిచిపెట్టిన వారికి రాజకీయ విమర్శలెందుకు? చిరు రాజకీయాల్లో ఎందుకు ఫెయిల్ అయ్యారో అన్నందుకు ఇదే ఉదాహరణ. చంద్రబాబు ప్రొజెక్ట్ ల సందర్శన ఓ డ్రామా. చంద్రబాబు పాలనలో ఒక్క సిమెంట్ బస్తా వేసారా..? ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఎక్కడ ఉందో చెప్పాలి? రెండుసార్లు ముఖ్యమంత్రి అయినా వంశధార ప్రాజెక్టుకు ఎంత ఖర్చు పెట్టారు? పొలిటికల్ టెర్రరిస్ట్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ను రాజకీయంగా కట్ చేయాలి. వంశధార కోసం ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడారా? వంశధారను మొదలు పెట్టింది వైఎస్సార్, కంటిన్యువేషన్ బాబు హయాంలో జరిగింది. వంశధార నిర్వాసితులను బాబు అసలు పట్టించుకోలేదు. హిర మండలం రిజర్వాయర్ పూర్తి చేసేది జగన్‌ మోహన్ రెడ్డి. నేరడి బ్యారెజ్ విషయంలో ఒడిశా ముఖ్యమంత్రితో కుడా జగన్ మాటాడారు.

Also Read..YSRCP MPS : ఎంపీగా నై.. ఎమ్మెల్యేగా సై.. వైసీపీలో ఆసక్తికర రాజకీయం.. ఎమ్మెల్యేగా పోటీకి ఎంపీల ఆసక్తి.. ఎవరా ఎంపీలు? కారణాలేంటి? 10టీవీ Exclusive Report

చంద్రబాబు డైరక్షన్ లో‌ బాబే కర్త కర్మ క్రియలుగా వ్యవహరించి పుంగనూరులో విధ్వంసం చేశారు. టీడీపీ వాళ్లను రెచ్చగొట్టారు. ఏపీ పోలీస్ యంత్రాంగానికి సెల్యూట్ చేయాలి. పుంగనూరులో పోలీసుల సంయమనం పాటించారు. చంద్రబాబు కుట్రల కారణంగా పోలీసులు గాయాలపాలై నెత్తురోడారు. చంద్రబాబు కుట్ర అందరికీ అర్దం అవుతుంది. పక్కా స్కెచ్ వేశారు. కత్తులు, కర్రలు, గన్స్, బీర్ బాటిల్స్ తో దాడి చేశారు. టీడీపీ కార్యకర్తలపై కాల్పులు జరగాలని చంద్రబాబు భావించారు.

చంద్రబాబుకి బుర్రా బుద్ది ఉందా? రూట్ మ్యాప్ లో‌ పుంగనూర్ టూర్ ఉందా.? లోకేశ్ రెచ్చగొట్టేలా దెబ్బ ఎలా ఉందో చూశారా అంటుంటే, బాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు. పోలీసుల దాడులపై పవన్ స్పందించరా..? దత్తపుత్రుడు ఎక్కడికి వెళ్లారు? నీకు, నీ పార్టీకి డ్రామాలు, వారాహిలు అవసరమా పవన్ ..? ఇదేం కర్మ ప్రోగ్రాంలో కూడా అలానే జనాలను చంపేశారు. పబ్లిసిటీ పిచ్చితో, సానుభూతి డ్రామా కోసం బాబు ప్రయత్నిస్తున్నారు. ఐఐటీలలో టాపర్, ఎస్పీ అయిన వ్యక్తులను విమర్శించడమా?

Also Read..Payakaraopet Constituency: పాయకరావుపేటలో అంతకుముందు అనితకు ఎదురైన పరిస్థితే.. ఇప్పుడు బాబురావుకు..

లోకేశ్ బాడీకి, లాంగ్వేజ్ కి ఏమైనా సంబంధం ఉందా..? ఎమ్మెల్యే అవుతారనే నమ్మకం ఉంటే నీ నియోజకవర్గం ఏంటో చెప్పు. మేం రాజకీయాలు వదిలి వెళ్లిపోతాం. లోకేశ్, చంద్రబాబులపై రౌడీషీట్ తెరిపించాలి. ఒళ్లు కొవ్వెక్కి ఉన్నారు. చేతకాని వారే హింసను ప్రేరేపిస్తారు. గెలుస్తాం అన్న నమ్మకం లేకనే ప్రజలను, కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు” అని మండిపడ్డారు మంత్రి సీదిరి అప్పలరాజు.

ట్రెండింగ్ వార్తలు