Asia Cup 2023: భారత్‌పై గెలవలేకపోయినప్పటికీ పాక్ ఈ పని చేయొద్దు: పాకిస్థాన్ మాజీ క్రికెటర్

ఇరు జట్ల మధ్య పోరు జరగనున్న వేళ పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Abdul Razzaq

Asia Cup 2023 – Abdul Razzaq: భారత్ – పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. శనివారం ఇరు దేశాల జట్లు (India vs Pakistan) తలపడనున్నాయి. ఆసియా కప్-2023లో ఈ ఇరు జట్లే ఫేవరెట్‌గా ఉన్నాయి. క్రికెట్ అభిమానులకు ఇదో పెద్ద పండుగ.

ఇరు జట్ల మధ్య పోరు జరగనున్న వేళ పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ భారత్‌తో మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రస్తుతం ఉన్న జట్టునే తదుపరి మ్యాచుల్లోనూ కొనసాగించాలని అన్నాడు.

పాకిస్థాన్ ప్రస్తుత జట్టు అన్ని విభాగాల్లో రాణిస్తూ సమతుల్యంతో ఉందని చెప్పాడు. సమర్థంగా ఆడే బ్యాటర్లు ఉన్నారని, మిడిల్ ఆర్డర్ లో రాణించే ఆల్ రౌండర్లు ఉన్నారని తెలిపాడు. పేస్, స్పిన్ బౌలింగ్‌లో పటిష్ఠంగా ఉందని చెప్పాడు. సమర్థంగా ఆడేవారు అన్ని విభాగాల్లోనూ ఉన్నారని అన్నాడు.

మంచి కూర్పుతో జట్టు ఉందని తెలిపాడు. భారత్‌తో మ్యాచులో ఓడిపోయినప్పటికీ పాకిస్థాన్ ప్రస్తుత జట్టులో మార్పులు చేసే అవసరం లేదని చెప్పాడు. కాగా, ఆసియా కప్-2023లో పాకిస్థాన్ ఇప్పటికే నేపాల్ పై గెలిచి బోణీ కొట్టింది.

BCCI Media Rights: బీసీసీఐకి డబ్బేడబ్బు.. వచ్చే ఐదేళ్ల కాలానికి ఆరువేల కోట్లు .. ఒక్కో మ్యాచ్ విలువ 67.76కోట్లు

ట్రెండింగ్ వార్తలు