ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్‌షాక్‌.. చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్‌గా రిష‌బ్ పంత్..! కేఎల్ రాహుల్ పయనం ఎటంటే?

ఐపీఎల్ 2024 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన రిషబ్ పంత్ ఆ జట్టును వీడబోతున్నట్లు తెలుస్తోంది.

Rishabh Pant

Rishabh Pant : ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్టుకు బిగ్ షాక్ తగలబోతుందా.. ఐపీఎల్ 2024 సీజన్ లో డీసీకి కెప్టెన్ వ్యవహరించిన రిషబ్ పంత్ ఆ జట్టును వీడబోతున్నాడా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్ లో రిషబ్ పంత్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతలు పంత్ కు అప్పగించేందుకు ఆ జట్టు యాజమాన్యం నిర్ణయించిందని, అందుకు ఆ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఆమోదముద్ర వేసినట్లు క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Also Read : Virat Kohli : దినేశ్ కార్తీక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. గ్ర‌హాంత‌ర వాసుల పై కోహ్లీకి ఆస‌క్తి..

మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2025 సీజన్ లో ఆడేది అనుమానమే. ఈ క్రమంలో ధోనీ తరహాలో జట్టుకు వికెట్ కీపర్, బ్యాటర్ కోసం ఆ జట్టు యాజమాన్యం వెతుకులాట ప్రారంభించింది. ధోనీ ప్లేస్ ను భర్తీ చేయగల సమర్ధుడు పంత్ అని, వచ్చే వేలంలో పంత్ ను భారీ మొత్తం చెల్లించి సీఎస్కే యాజమాన్యం దక్కించుకోబోతుందని  తెలుస్తోంది. కెప్టెన్సీ బాధ్యతలు కూడా పంత్ కే అప్పగిస్తారని సమాచారం. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభ మ్యాచ్ లలో సీఎస్కే జట్టుకు ధోనీనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఆ తరువాత రుతురాజ్ గైక్వాడ్ కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించి ధోనీ పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్నాడు. గాయం కారణంగా పలు మ్యాచ్ లలో తీవ్ర ఇబ్బంది పడిన ధోనీ.. 2025 సీజన్ లో ఆడటం కష్టమనే చెప్పొచ్చు. ప్రస్తుత సీఎస్కే కెప్టెన్ గైక్వాడ్ ఆశించిన స్థాయిలో జట్టును నడిపించలేక పోయాడనే వాదన ఉంది. ఈ పరిస్థితుల్లో సుదీర్ఘకాలం ధోనీ తరహాలో జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు విజయవంతంగా నిర్వహించగలిగే భారత్ క్రికెటర్లలో పంత్ సరైనోడని సీఎస్కే జట్టు యాజమాన్యం బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. దీంతో పంత్ ను జట్టులోకి తీసుకొని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సిద్ధమైందన్న వార్తలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి.

Also Read : భార్యకోసం రోజుకు 320 కి.మీ ప్రయాణిస్తున్న భర్త.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

మరోవైపు ఐపీఎల్ 2024 సీజన్ లో లక్నో జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన కేఎల్ రాహుల్.. 2025 సీజన్ లో ఆ జట్టుకు గుడ్ బై చెప్పి బెంగళూరు జట్టులో చేరబోతున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లో లక్నో యాజమాని, కేఎల్ రాహుల్ మధ్య వివాదం వీడియో వైరల్ గా మారింది. అప్పటి నుంచి లక్నో జట్టు నుంచి తప్పుకోవాలని రాహుల్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా అతను బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టులో చేరబోతున్నాడని సమాచారం. పంత్, రాహుల్ జట్ల మార్పుపై స్పష్టత రావాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.

 

ట్రెండింగ్ వార్తలు