Neeraj Chopra: 140 కోట్ల మంది భారతీయులు గర్వపడే మరో పని చేసిన నీరజ్.. మైదానంలో కాదు బయట..

నీరజ్ చోప్రా వద్దకు ఓ మహిళ వచ్చింది. హంగేరీ (Hungary)కి చెందిన ఆమె భారత జాతీయ జెండాను తీసుకొచ్చింది.

Neeraj Chopra

Neeraj Chopra – Indian flag: జావెలిన్ త్రోలో భారత్ కు పతకాల పంట పండిస్తున్న నీరజ్ చోప్రా (25) తన వైఖరితోనూ ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ ( World Athletics Championships- 2023) జావెలిన్ త్రోలో భారత స్టార్ నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

హంగేరీలోని బుడాపెస్ట్‌లో ఈ ఛాంపియన్‌షిప్ జరిగింది. ఇందులో స్వర్ణం గెలిచిన మొట్టమొదటి భారతీయుడిగా నీరజ్ చోప్రా నిలిచాడు. అనంతరం నీరజ్ చోప్రా వద్దకు ఓ మహిళ వచ్చింది. హంగేరీ (Hungary) చెందిన ఆమె భారత జాతీయ జెండాను తీసుకొచ్చింది. దానిపై ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరింది.

అయితే, దానిపై సంతకం చేయకూడదని అది, తన దేశ జెండా నిబంధనలకు వ్యతిరేకమని చెప్పాడు. అందుకు బదులుగా ఆమె టీషర్ట్ పై నీరజ్ చోప్రా ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. మైదానంలోనే కాకుండా బయటకు కూడా నీరజ్ చోప్రా అందరి మనసులను దోచేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించిన ఫొటోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

నీరజ్ చోప్రా అమేజింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అందరికీ అతడు స్ఫూర్తిగా నిలుస్తున్నాడని అంటున్నారు. జాతీయ జెండా పట్ల ఆయన వినయం, గౌరవం అభినందనీయమని కొందరు కామెంట్లు చేశారు.

Neeraj Chopra: పాక్ ప్లేయర్‌ పట్ల నీరజ్ చోప్రా ప్రవర్తనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్న నెటిజన్లు .. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు