Asia Cup 2023: ఆసియా కప్ మాత్రమే కాదు.. వన్డే ప్రపంచ కప్ మ్యాచులూ ఫ్రీగా చూడొచ్చు..

ఇప్పటికే జియోసినిమా పలు టోర్నమెంట్లను ఉచితంగా స్ట్రీమింగ్ చేసి మొబైల్ యాప్ డౌన్‌లోడ్ల సంఖ్యను విపరీతంగా పెంచుకున్న విషయం తెలిసిందే.

Asia Cup 2023

Asia Cup 2023 – Disney Hotstar: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. ప్రస్తుతం జరుగుతోన్న ఆసియా కప్-2023తో పాటు అక్టోబరు 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచ కప్-2023 (World Cup 2023) మ్యాచులను డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఉచితంగా చూడొచ్చు. ఈ విషయాన్ని డిస్నీ+ హాట్‌స్టార్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇప్పటికే జియోసినిమా పలు టోర్నమెంట్లను ఉచితంగా స్ట్రీమింగ్ చేసి మొబైల్ యాప్ డౌన్‌లోడ్ల సంఖ్యను విపరీతంగా పెంచుకున్న విషయం తెలిసిందే. ఆసియా కప్-2023 పాకిస్థాన్, శ్రీలంకతో జరుగుతుండగా, వన్డే ప్రపంచ కప్-2023 భారత్ లో జరగనుంది. గత ఏడాది నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌ కు భారీగా నష్టాలు వచ్చాయని రాయిటర్స్ తెలిపింది.

యూజర్లు భారీగా తగ్గిపోవడంతో దాదాపు రూ.343 కోట్లు నష్టపోయింది. గత ఏడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది జులై మధ్య యూజర్లు దాదాపు 25 శాతం మంది తగ్గిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆ కంపెనీ ఒత్తిడి ఎదుర్కొంటోంది. మళ్లీ లాభాలు రాబట్టడానికి ప్రణాళికలు వేసుకుంది.

జియో సినిమాలో పలు టోర్నమెంట్లు ఉచితంగా ప్రసారమై, డిస్నీ+ హాట్‌స్టార్‌‌లో స్ట్రీమింగ్ కాకపోవడంతో చాలా మంది హాట్‌స్టార్‌‌ సబ్‌స్ర్కిప్షన్లను రద్దు చేసుకున్నారు. దీంతో జియోలా ఉచితంగా క్రికెట్ మ్యాచులను ప్రసారం చేయాలని డిస్నీ+ హాట్‌స్టార్‌‌ నిర్ణయం తీసుకుంది.

హెచ్‌బీవో షోలను డిస్నీ+ హాట్‌స్టార్‌‌ లో ఆపేయడం కూడా ఈ ఓటీటీ యూజర్ల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం. గేమ్ ఆఫ్ థ్రోన్స్, సక్సెషన్, త్వరలో ప్రసారం కావాల్సిన హ్యారీ పోటర్ సిరీస్ డిస్నీ ఓటీటీ ప్లాట్‌ఫాంలో ప్రసారం కావట్లేదు. అవి జియో సినిమాలో ప్రసారం అవుతున్నాయి.

Asia Cup 2023: ఆరోజు పాక్ వర్సెస్ ఇండియా మ్యాచ్ చూడలేమా? అసలు విషయం ఏమిటంటే..

ట్రెండింగ్ వార్తలు