ODI World Cup : నీకు ఎలా ఆడాలో మీ నాన్న నేర్పించ‌లేదా..? మార్ష్‌ను ప్రశ్నించిన గవాస్కర్..

ఆస్ట్రేలియా శ్రీలంక పై 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. మ్యాచ్ త‌రువాత మిచెల్ మార్ష్ దూకుడుగా ఆడ‌డంపై భార‌త మాజీ దిగ్గజ ఆట‌గాడు సునీల్ గ‌వాస్క‌ర్ స‌ర‌దాగా కామెంట్లు చేశాడు.

Sunil Gavaskar-Mitchell Marsh

ODI World Cup 2023 : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియా ఎట్ట‌కేల‌కు బోణీ కొట్టింది. వ‌రుస‌గా మొద‌టి రెండు మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా మూడో మ్యాచులో శ్రీలంక పై 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. సోమ‌వారం ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన మ్యాచులో మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ఆస్ట్రేలియా స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో డేవిడ్ వార్న‌ర్‌, స్టీవ్ స్మిత్‌ల వికెట్ల‌ను కోల్పోయి 24/2 స్కోరుతో నిలిచింది.

అయితే.. ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ 45 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ బాదడంతో ఆసీస్ కోలుకుంది. ఈ మ్యాచ్‌లో మార్ష్ 51 ప‌రుగుల వ‌ద్ద ర‌నౌట్ అయ్యాడు. మార్ష్‌తో పాటు జోష్ ఇంగ్లిస్ (58) కూడా రాణించ‌డంతో ఆసీస్ ప్ర‌పంచ‌క‌ప్ లో మొద‌టి విజ‌యాన్ని అందుకుంది. ఇక మ్యాచ్ త‌రువాత మిచెల్ మార్ష్ దూకుడుగా ఆడ‌డంపై భార‌త మాజీ దిగ్గజ ఆట‌గాడు సునీల్ గ‌వాస్క‌ర్ స‌ర‌దాగా కామెంట్లు చేశాడు.

HCA Elections 2023 : హెచ్‌సీఏ ఎన్నిక‌ల బ‌రిలో అనిల్ కుమార్ ప్యానెల్‌.. హెచ్‌సీఏను ప్ర‌క్షాళ‌న చేస్తాం

వ‌న్డేల్లో మిచెల్ మార్ష్ స్ట్రైక్ రేటు 93.85 కాగా.. అత‌డి తండ్రి జియోఫ్ మార్ష్ స్ట్రైక్ రేటు 55.33గా ఉంది. దీనిని ఉద్దేశించి గ‌వాస్క‌ర్ మాట్లాడుతూ.. ‘నీ బ్యాటింగ్ మీ తండ్రి జియోఫ్ మార్ష్ బ్యాటింగ్ కు పూర్తి విరుద్దంగా ఉంది.’ అని అన్నాడు. ‘నీకు ఎలా ఆడాడో నీ తండ్రి నేర్పించ‌లేదా (డిఫెన్సివ్ గా ఆడ‌డం ఎలాగో)..? నువ్వు మాత్రం విధ్వంసక‌రంగా ఆడుతున్నావు.’ అంటూ గ‌వాస్క‌ర్ అన్నాడు. దీనికి మిచెల్ మార్ష్ అదిరిపోయే స‌మాధానం చెప్పాడు. ‘నేను అతని పేలవమైన స్ట్రైక్ రేట్లను భర్తీ చేస్తున్నాను.’ అని అన్నాడు.

అదే జ‌రిగితే..

శ్రీలంక పై విజ‌యం సాధించ‌డం ఆస్ట్రేలియాకు చాలా ముఖ్యం. ఇదే ఊపును మిగిలిన మ్యాచుల్లో కొన‌సాగించి సెమీఫైన‌ల్‌కు చేరుకోవాల‌ని ఆసీస్ అభిమానులు కోరుకుంటున్నారు. ఒక వేళ ఆస్ట్రేలియా గ‌నుక ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలిస్తే.. మిచెల్ మార్ష్‌, జియోఫ్ మార్ష్ లు చ‌రిత్ర సృష్టిస్తారు. ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన తండ్రీ కొడుకులుగా నిలుస్తారు. భార‌త‌దేశంలో జ‌రిగిన 1987 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఆ జ‌ట్టులో జియోఫ్ మార్ష్ స‌భ్యుడు అన్న సంగ‌తి తెలిసిందే.

Shahid Afridi: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సోదరి మృతి

ట్రెండింగ్ వార్తలు