Kalyan Chaubey: ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడిగా కల్యాణ్ చౌబే.. 33-1 తేడాతో భూటియా ఘోర పరాజయం

లెజెండరీ ఫుట్‭బాలర్ భైచుంగ్ భూటియాను ఆయన 33-1 తేడాతో ఓడించారు. కాగా, 85 ఏళ్ల చరిత్రలో ఆల్ ఇండియా ఫుట్‭బాల్ ఫెడరేషన్‭కు ఒక ఆటగాడు అధ్యక్షుడు అవ్వడం ఇదే తొలిసారి. 45 ఏళ్ల కల్యాణ్ చౌబే.. తూర్ప్ బెంగాల్‭కు గోల్ కీపర్‭గా ఆడారు. ఇక ఫుట్‭బాల్ ఇండియా టీంకు మాజీ కోచ్ అయిన భూటియా 34 ఓట్లలో కేవలం ఒకటంటే ఒక ఓటు మాత్రమే సాధించడం గమనార్హం.

Kalyan Chaubey: ఆల్ ఇండియా ఫుట్‭బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా మాజీ ఫుట్‭బాల్ కల్యాణ్ చౌబే ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో లెజెండరీ ఫుట్‭బాలర్ భైచుంగ్ భూటియాను ఆయన 33-1 తేడాతో ఓడించారు. కాగా, 85 ఏళ్ల చరిత్రలో ఆల్ ఇండియా ఫుట్‭బాల్ ఫెడరేషన్‭కు ఒక ఆటగాడు అధ్యక్షుడు అవ్వడం ఇదే తొలిసారి. 45 ఏళ్ల కల్యాణ్ చౌబే.. తూర్ప్ బెంగాల్‭కు గోల్ కీపర్‭గా ఆడారు. ఇక ఫుట్‭బాల్ ఇండియా టీంకు మాజీ కోచ్ అయిన భూటియా 34 ఓట్లలో కేవలం ఒకటంటే ఒక ఓటు మాత్రమే సాధించడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కు ఫిఫా షాకిచ్చింది. భారత ఫుట్బాల్ సమాఖ్యను సస్పెండ్ చేస్తున్నట్లు ఫిఫా ప్రకటించింది. భారత ఫుట్బాల్ ఫెడరేషన్‭లో బయటి వ్యక్తుల జోక్యం ఎక్కువగా ఉన్నట్లు ఫిఫా తేల్చింది. ఇలాంటి అసోసియేషన్‭లను తాము గుర్తించలేమని స్ఫష్టం చేసింది. ఈ సస్పెన్షన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని ఫిఫా వెల్లడించింది. ఫిఫా చట్టాలను ఉల్లఘించినందుకే ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్‭పై చర్యలు తీసుకున్నట్లు వివరించింది. భారత ఫుట్బాల్ సమాఖ్య సస్పెన్షన్పై ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవ తీర్మానం చేసింది.

Pawan Kalyan Birthday Special Song : మనల్ని ఎవడ్రా ఆపేది.. పవన్ కళ్యాణ్ బర్త్‌డే స్పెషల్ సాంగ్..

ట్రెండింగ్ వార్తలు