Fan Murder: తాగిన మత్తులో గొడవ.. రోహిత్ ఫ్యాన్‭ని చంపిన కోహ్లి ఫ్యాన్

చనిపోయిన వ్యక్తి పేరు పి.విఘ్నేష్ (24), హత్యకు పాల్పడ్డ వ్యక్తి పేరు ఎస్.ధర్మరాజ్. విఘ్నేష్.. విరాట్ కోహ్లి అభిమాని కాగా, ధర్మరాజ్.. రోహిత్ శర్మకి అభిమాని. కీలపలూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి మల్లూరు సమీపంలోని సిడ్కో ఇండస్ట్రియల్ ఇస్టేట్ ప్రాంతంలో విఘ్నేష్, ధర్మరాజ్ మద్యం తాగుతూ క్రికెట్ గురించి చర్చ ప్రారంభించారు. ఇంతలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంను విరాట్ కోహ్లీని హేళన చేస్తూ విఘ్నేష్ మాట్లాడాడు.

Fan Murder: ఇద్దరు సినిమా హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరస్పర దూషణలు, గొడవలు.. ఇవి కాస్త ముదిరి ఒక్కోసారి ప్రాణాల మీద వరకు కూడా పోతుంటాయి. కానీ, క్రీడాభిమానుల మధ్య క్రీడా స్ఫూర్తి కనిపిస్తుంటుంది. మెజారిటీ క్రీడాభిమానులు ఇతరులపై ఎక్కువగా విమర్శలకు పోరు. చాలా అరుదుగా సున్నితమైన విమర్శలు చేసుకుంటారు. కానీ, తమిళనాడులోని ఇద్దరు క్రీడాభిమానులు పూర్తిగా క్రీడాస్ఫూర్తిని వదిలేసి గొడవ పడ్డారు. తాగిన మత్తులో ఉన్న ఆ ఇద్దరు కాసేపు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఇంతలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని హతమార్చాడు. ఆ ఇద్దరు వ్యక్తులు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల అభిమానులు.

తమిళనాడులోని అరియలూరు జిల్లా పొయ్యూరు అనే గ్రామంలో వెలుగు చూసిన దారుణం ఇది. చనిపోయిన వ్యక్తి పేరు పి.విఘ్నేష్ (24), హత్యకు పాల్పడ్డ వ్యక్తి పేరు ఎస్.ధర్మరాజ్. విఘ్నేష్.. విరాట్ కోహ్లి అభిమాని కాగా, ధర్మరాజ్.. రోహిత్ శర్మకి అభిమాని. కీలపలూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి మల్లూరు సమీపంలోని సిడ్కో ఇండస్ట్రియల్ ఇస్టేట్ ప్రాంతంలో విఘ్నేష్, ధర్మరాజ్ మద్యం తాగుతూ క్రికెట్ గురించి చర్చ ప్రారంభించారు. ఇంతలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంను విరాట్ కోహ్లీని హేళన చేస్తూ విఘ్నేష్ మాట్లాడాడు.

అంతకు ముందు కూడా విఘ్నేష్ ఇలా మాట్లాడినట్లు తన స్నేహితులతో తెలుసుకున్న ధర్మరాజ్.. మందు బాటిల్‭తో విఘ్నేష్ తల పగలకొట్టాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం బుధవారం ఉదయం విఘ్నేష్ మృతదేహాన్ని అక్కడి కార్మికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు కనుక్కుని ధర్మరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Rahul Gandhi: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ డుమ్మా!

ట్రెండింగ్ వార్తలు