International Cricket: అంతర్జాతీయ క్రికెట్‌లో వాడే బంతి ఏది? దాని ధర ఎంతో తెలుసా? ఎన్ని రకాల బంతులను వాడుతారంటే?

క్రికెట్ క్రీడకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా భారత్‌లాంటి దేశాల్లో ఈ క్రీడకు క్రేజ్ ఎక్కువ. టెస్ట్ మ్యాచ్ నుంచి వన్డే, టీ20 మ్యాచ్ ఏదైనా సరే సమయానికి టీవీల ముందు వాలిపోతుంటారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టీ20వరల్డ్ కప్ టోర్నీ జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులకు పండుగ వాతావరణంలా మారింది.

International Cricket: క్రికెట్ క్రీడకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా భారత్‌లాంటి దేశాల్లో ఈ క్రీడకు క్రేజ్ ఎక్కువ. టెస్ట్ మ్యాచ్ నుంచి వన్డే, టీ20 మ్యాచ్ ఏదైనా సరే సమయానికి టీవీల ముందు వాలిపోతుంటారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టీ20వరల్డ్ కప్ టోర్నీ జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులకు పండుగ వాతావరణంలా మారింది. ముఖ్యంగా భారత్ సెమీఫైనల్స్ లోకి అడుగుపెట్టడంతో గురువారం ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ కోసం ఆసక్తిగాఎదురుచూస్తున్నారు. మ్యాచ్ చూసే సమయంలో కొందరి క్రికెట్ అభిమానులు పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ బంతిని ఉపయోగిస్తారు? దాని ధర ఎంత అనేది చాలామంది క్రికెట్ అభిమానులకు ఆసక్తికర అంశంగానే ఉంటుంది. మ్యాచ్‌లో మొత్తం ఎన్ని బంతులు ఉపయోగించారు? పాత బంతిని ఏమి చేస్తారు అనే ప్రశ్న కూడా వారి మదిలో మెదులుతుంటాయి.

Duke, Kookaburra, SG Cricket Ball– క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా మ్యాచ్ ఫార్మాట్ ప్రకారం బంతిని ఎంపిక చేస్తారు.

– టెస్ట్ మ్యాచ్‌లో ఎరుపు రంగు, టీ20, వన్డే మ్యాచ్‌లలో తెలుపు లెదర్ బంతిని ఉపయోగిస్తారు. ఇప్పుడు పింక్ బాల్ కూడా వాడుతున్నారు.

– వీటిలో కూడా కొన్ని దేశాలు వివిధ కంపెనీల బంతులను ఉపయోగిస్తాయి.

– కూకబుర్రా యొక్క టర్ఫ్ వైట్ బాల్ సాధారణంగా T20, వన్ డే మ్యాచ్‌లలో ఉపయోగిస్తారు. అదే సమయంలో ఎస్‌జీ, డ్యూక్ బాల్స్‌ను కొన్ని ప్రాంతాల్లో ఉపయోగిస్తారు.

– డ్యూక్ బాల్, ఎస్జీ బాల్, కూకబుర్ర బాల్ అనే మూడు బంతులు టెస్ట్ మ్యాచ్‌లో ఆడటానికీ ఆమోదించబడ్డాయి.

– ఇంగ్లండ్, వెస్టిండీస్‌లో డ్యూక్‌లను ఉపయోగిస్తారు. భారతదేశం ఎస్జీ క్రికెట్ బంతులను ఉపయోగిస్తుంది.

– కూకబుర్ర బంతులను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, జింబాబ్వేలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

– డ్యూక్, ఎస్‌జీ క్రికెట్ బంతులు చేతితో కుట్టినవి. కూకబుర్ర సగం చేతితో, సగం యంత్రంతో కుట్టినవి ఉంటాయి.

– టీ20, వన్డే మ్యాచ్ గురించి మాట్లాడినట్లయితే.. ప్రతి ఇన్నింగ్స్‌కు ఒక బంతి ఇవ్వబడుతుంది. అంటే, ఒక మ్యాచ్‌లో రెండు కొత్త బంతులు ఉపయోగిస్తారు.

SG Cricket Ball

– బౌలర్ ఎప్పుడైనా బంతి ఆకారాన్ని మార్చడం గురించి ఫిర్యాదు చేస్తే, అతనికి మరొక బంతిని ఇస్తారు. కానీ పాత బంతిని మాత్రమే ఉపయోగిస్తారు.

– ఉదాహరణకు, 15వ ఓవర్‌లో బంతిని మార్చమని అభ్యర్థించినట్లయితే ఆ సమయంలో కొత్త బంతిని ఇవ్వరు. కానీ మొదటి మ్యాచ్‌లో దాదాపు 15 ఓవర్ల పాటు ఉపయోగించిన బంతిని ఉపయోగిస్తారు.

– సాధారణంగా ఉపయోగించే కూకబుర్ర టర్ఫ్ వైట్ బాల్ సుమారు రూ. 15వేలు ఉంటుంది. ఇంటర్నెట్‌లోని వివిధ వెబ్‌సైట్లలో దీని ధర 13వేల నుండి రూ. 17వేల వరకు చూపిస్తుంది. ఇతర కంపెనీల బాల్ కూడా దాదాపు ఈ ధరలను పోలి ఉంటాయి.

– క్రికెట్ బంతుల వాడకంలో పిచ్ స్వభావం, పరిస్థితులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి.

Duke Cricket Ball

– ఇంగ్లాండ్ సాధారణంగా మేఘావృతమైన పరిస్థితులు, ఆకుపచ్చ పిచ్‌లను కలిగి ఉంటుంది. డ్యూక్ బంతులను ఉపయోగిస్తారు.

– భారత్‌లో కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. పిచ్‌లు ఓపెన్‌గా ఉంటాయి. కాబట్టి, మందపాటి దారం బంతిని ఎక్కువ కాలం చెక్కుచెదరకుండా ఉంచుతుంది కాబట్టి ఎస్జీ బాల్ బాగా సరిపోతుంది.

– బంతి వేగంగా ఆకారాన్ని కోల్పోయినప్పటికీ, కూకబుర్రా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో బౌన్సీ పరిస్థితులకు బాగా సరిపోతుంది.

ట్రెండింగ్ వార్తలు