IPL 2024 : ఆర్సీబీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ప్లేఆఫ్ ఆశలు గల్లంతేనా?

శనివారం ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, సీఎస్కే జట్ల మధ్య మ్యాచ్ కోసం ఇరుజట్ల ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

RCB vs CSK Match (credit _ Google)

CSK vs RCB Match : ఐపీఎల్ 2024లో కీలకమైన మ్యాచ్ ఈనెల 19న ఎం చిన్నస్వామి స్టేడియం జరగనుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ప్లేఆఫ్ కు చేరుకోవాలంటే ఈ రెండు జట్లకు శనివారం జరిగే మ్యాచ్ ఎంతో కీలకమైంది. సీఎస్కే జట్టు ఇప్పటికే 13 మ్యాచ్ లలో ఏడు గెలిచి 14 పాయింట్లతో ప్లేఆఫ్ రేసులో ఉంది. ఆర్సీబీ జట్టుసైతం 13 మ్యాచ్ లలో ఆరు గెలిచి 12 పాయింట్లతో ప్లే ఆఫ్ రేసులో ఉంది. 19న జరిగే మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధిస్తే చెన్నైను వెనక్కు నెట్టి ప్లేఆఫ్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ చెన్నై గెలిచినా, మ్యాచ్ రద్దయినా ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలు గల్లంతయినట్లే. ఇలాంటి సమయంలో ఆర్సీబీ ఫ్యాన్స్ ను వరుణుడు భయపెడుతున్నాడు.

Also Read : రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి.. కోహ్లీ ఏమన్నారంటే..

శనివారం ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, సీఎస్కే జట్ల మధ్య మ్యాచ్ కోసం ఇరుజట్ల ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ మ్యాచ్ జరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మే17 (శుక్రవారం) నుంచి మే 21 (మంగళవారం) వరకు ఐదు రోజుల పాటు బెంగళూరులో ఉరుములుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలుకూడా పడే అవకాశం ఉండటంతో మ్యాచ్ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్ అవకాశం కోల్పోతుంది. సీఎస్కే నేరుగా ప్లేఆఫ్ కు చేరుకుంటుంది.

Also Read : DC vs LSG : ఏమ‌య్యా గోయెంకా.. పంత్‌ను కౌగిలించుకున్నావ్ స‌రే.. రాహుల్‌తో మ‌ళ్లీ ఏందిది..

వాతావరణ శాఖ వివరాల ప్రకారం..74శాతం వర్షం కురిసే అవకాశం ఉందని, రాత్రి వేళల్లో 100శాతం ఆకాశం మేఘావృతమై 62శాతం వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షం కురిసినప్పటికీ భారీ వర్షం కాకుంటే మ్యాచ్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఐదు ఓవర్ల వరకు జరిగే అతి తక్కువ మ్యాచ్ ను రాత్రి 10.56 గంటలకు వరకు ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మ్యాచ్ పూర్తిగా జరిగితే.. ఆర్సీబీ జట్టు తొలుత బ్యాటింగ్ తీసుకుంటే 200 పరుగులు చేస్తే 18 పరుగుల తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. ఛేదనలో 200 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే సీఎస్కే కంటే మెరుగైన రన్ రేటుతో ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది. ఇప్పటికే కోల్ కతా, రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి. సన్ రైజర్స్ రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. వీటిలో ఒక మ్యాచ్ లో విజయం సాధించినా ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది.

 

 

ట్రెండింగ్ వార్తలు