Tech Tips in Telugu : ఆటో పేమెంట్ చేస్తున్నారా? గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పేలో ఆటో పే ఫీచర్ ఎనేబుల్ ఎలా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

Tech Tips in Telugu : డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా ఆటో పే ఫీచర్ ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా సులభంగా ఆన్‌లైన్ పేమెంట్లు చేసుకోవచ్చు.

How to enable auto-pay feature on GPay, Paytm, PhonePe and other payment apps

Tech Tips in Telugu : ప్రతి నెలా అన్ని బిల్లులు, పేమెంట్ల తేదీలను గుర్తుంచుకోవడం కష్టమే. మీ ఫోన్ బిల్లుల నుంచి ఈఎంఐల వరకు లాస్ట్ పేమెంట్ తేదీలను డిజిటల్ పేమెంట్ యాప్స్ రిమైండర్ సెట్ చేసుకోవచ్చు. ప్రతిసారీ మాన్యువల్‌గా పేమెంట్లను చేయడం ఇబ్బందికరమైన విషయమే. కొన్నిసార్లు గడవు తేదీని మరిచిపోతుంటారు. సకాలంలో పేమెంట్లను చేయకపోతే.. అదనపు ఆలస్య రుసుములను చెల్లించాల్సి వస్తుంది. లేదంటే.. కొన్ని సమయాల్లో సర్వీసు నిలిచిపోతుంది.

అదే.. (Autopay) ఫీచర్ ఎనేబుల్ చేసుకోవడం ద్వారా గడువు తేదీ రాగానే ఆటో పేమెంట్ అయిపోతుంది. దాదాపు అన్ని బ్యాంకింగ్ యాప్‌లు, ఇతర సర్వీసుల ద్వారా ఆటో పే ఆప్షన్ అందిస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్ పేమెంట్ యాప్స్‌లో Paytm, Google Pay, Phone Pe వంటి UPI యాప్‌లు కూడా వినియోగదారులకు ఆటో పే ఆప్షన్ అందిస్తున్నాయి.

ఆటోపే (Auto Pay) అంటే ఏంటి? :
ఆటోపే.. నెలవారీ పేమెంట్లను సులభతరం చేసేందుకు బ్యాంకింగ్ లేదా UPI యాప్‌లు, సర్వీసులను అందించే ఫీచర్. ఉదాహరణకు, మీరు ప్రతి నెలా ఒక నిర్దిష్ట తేదీన మీ ఫోన్ బిల్లును పొందుతారు. ప్రతి నెల 5వ తేదీని అనుకుందాం. ప్రతి నెలా 15వ తేదీలోపు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో, మీరు ఎలాంటి మాన్యువల్ పేమెంట్ చేయాల్సిన పనిలేదు.

Read Also : Best Premium Flagship Phones : కొత్త ఫోన్ కావాలా? ఈ నెలలో 4 బెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

ఆటోమేటిక్ పేమెంట్ చేయడానికి 5వ తేదీ నుంచి 15వ తేదీల మధ్య నిర్దిష్ట తేదీని సెట్ చేయవచ్చు. హోమ్ లోన్‌లు, EMI, సకాలంలో బిల్లులు వంటి పెద్ద చెల్లింపుల విషయంలో లేట్ పేమెంట్ లేదా పేమెంట్లు తప్పిన సందర్భంలో బ్యాంకులు విధించే పెనాల్టీ లేదా అదనపు ఛార్జీలను నివారించడానికి ఉపయోగపడుతుంది. వాస్తవానికి, మీరు OTT సర్వీసుల కోసం నెలవారీ సభ్యత్వాన్ని కలిగి ఉంటే.. మీరు సకాలంలో పేమెంట్లను చేయడానికి ఆటోపేను ఉపయోగించవచ్చు.

ఆటోపే ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే? :
* వినియోగదారులు రూ. 1 నుంచి రూ. 5వేల మధ్య మొత్తం ఆటో పే పేమెంట్లను సెట్ చేసే అవకాశం ఉంది.
* తమ అవసరాలకు అనుగుణంగా నెలవారీ పేమెంట్లను సవరించడానికి లేదా పాజ్ చేయడానికి లేదా నిలిపివేయడానికి కూడా ఆప్షన్ కలిగి ఉంటారు.
* సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఎంచుకోవాలి (పేమెంట్ అవసరం, EMI, బిల్లులు)
* UPI పిన్ నమోదు చేయడం ద్వారా నెలవారీ పేమెంట్లను అథెంటికేషన్ చేసుకోవాలి.
* ప్రతి వారం, నెలవారీ, త్రైమాసిక చెల్లింపులకు ఆటో పే ఆప్షన్ సెట్ చేసే ఆప్షన్ పొందుతారు.

Paytm, Gpay, ఇతర UPI యాప్‌లలో ఆటోపే ఫీచర్‌ని ఎనేబుల్ ఎలా? :
* పేటీఏంలో Auto Pay సెటప్ చేయండి.
* Paytm యాప్‌లో మీ బ్యాంక్ అకౌంట్లను UPI పేమెంట్లకు ఎనేబుల్ చేసుకోవాలి.
* ఇప్పుడు, Paytm యాప్‌ని ఓపెన్ చేసి.. ‘ఆటోమేటిక్ పేమెంట్లు’ ఆప్షన్ కోసం సెర్చ్ చేయండి.
* మీరు UPI ఆటోమేటిక్ పేమెంట్ల ఆప్షన్ ఎంచుకోవచ్చు.
* ఇప్పుడు, రైట్ టాప్ కార్నర్‌లో ఉన్న Set Up Now ఆప్షన్ నొక్కండి.
* మీరు OTT సర్వీసులు, రీఛార్జ్‌లు, బిల్లులు, LIC, పైప్డ్ గ్యాస్ మొదలైన వాటితో సహా అందుబాటులో ఉన్న సర్వీసుల్లో ఒకదాని నుంచి ఎంచుకోవచ్చు.
* అవసరమైన వివరాలను ఎంటర్ చేసి.. ఆపై ప్రతి నెలా చెల్లించేందుకు UPI పేమెంట్ చేయాలనుకునే అకౌంట్ ఎంచుకోండి.

Tech Tips in Telugu : How to enable auto-pay feature on GPay, Paytm, PhonePe and other payment apps

GPayలో ఆటో పేమెంట్ సెటప్ చేయండి :
* గూగుల్ పే యాప్‌ని ఓపెన్ చేయండి.
* టాప్ రైట్ కార్నర్‌లో మీ ప్రొఫైల్ ఫొటో క్లిక్ చేయండి.
* ఆటో పేమెంట్ ఎంచుకోండి.
* మీరు ఈ ఆటో పేమెంట్ సెట్టింగ్స్ ఎడిట్ చేయొచ్చు లేదా ఉపసంహరించుకోవచ్చు.
* పేమెంట్ అథెంటికేషన్ చేయడం లేదా రిజక్ట్ చేయడం వంటి చేయొచ్చు.
* గడువు ముగిసిన లేదా రద్దు చేసిన పేమెంట్లు వంటి పూర్తి అయిన పేమెంట్లను చెక్ చేసుకోవచ్చు.
* కొత్త పేమెంట్ క్రియేట్ చేయడానికి పెండింగ్‌లో ఉన్న విభాగంలో అవసరమైన ఆప్షన్ ఎంచుకోవచ్చు.
* ఆటో పేమెంట్ సెటప్ చేయండి. అవసరమైన వివరాలను నమోదు చేయండి.
* ఒకసారి UPI పిన్‌ని ఎంటర్ చేయడం ద్వారా యాక్సస్ చేసుకోవచ్చు.

BHIM UPIలో ఆటోపేను సెటప్ చేయండి :
* BHIM యాప్‌ని ఓపెన్ చేయండి.
* ఆటో డెబిట్ ఆప్షన్ ఎంచుకోండి.
* ఇప్పుడు, మాండేట్ బటన్‌పై నొక్కండి.
* మీరు కొత్త పేమెంట్ ఆప్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇదివరకే ఆటో పేమెంట్ ఆప్షన్ ఉంటే సెలక్ట్ చేసుకోవచ్చు.
* సరిగ్గా సెటప్ చేయడానికి మర్చంట్ పేరు, కస్టమర్ ID మొదలైన అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి.

Read Also : Google Pixel 8 Series : గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ఈ తేదీ నుంచే ప్రీ-ఆర్డర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు