Oppo A38 Launch India : సరసమైన ధరకే ఒప్పో A38 ఫోన్ వచ్చేసింది.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోండి..!

Oppo A38 Launch India : కొత్త ఫోన్ కొంటున్నారా? సరసమైన ధరకే ఒప్పో A38 ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉన్నాయంటే?

Oppo A38 With MediaTek Helio G70 SoC, 50-Megapixel Rear Camera Launched

Oppo A38 Launch India : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ ఒప్పో (Oppo) నుంచి కొత్త (Oppo A38) ఫోన్ ఈ వారం ప్రారంభంలో యూఏఈలో లాంచ్ అయింది. ఆ తర్వాత ఇటీవలే భారత మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో చిప్‌సెట్‌తో ఆధారితమైనది. 33W వైర్డు SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా డిస్ప్లే పైభాగంలో సెంటర్-అలైన్డ్ వాటర్‌డ్రాప్ నాచ్‌తో వస్తుంది. ఈ ఫోన్ దేశంలో సింగిల్ స్టోరేజ్ ఆప్షన్‌లో 2 కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌ల కోసం ఈ ఒప్పో A38 ఫోన్ అందుబాటులో ఉంది.

Read Also : Tech Tips in Telugu : ఆటో పేమెంట్ చేస్తున్నారా? గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పేలో ఆటో పే ఫీచర్ ఎనేబుల్ ఎలా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

భారత్‌లో ఒప్పో A38 ధర ఎంతంటే? :
గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఒప్పో A38 సింగిల్ 4GB + 128GB వేరియంట్ భారత మార్కెట్లో ధర రూ. 12,999కు అందుబాటులో ఉంది. అధికారిక ఒప్పో వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్‌లకు ఫోన్ అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫోన్ సెప్టెంబర్ 13 నుంచి సేల్ ప్రారంభం కానుంది.

Oppo A38 With MediaTek Helio G70 SoC, 50-Megapixel Rear Camera Launched

ఒప్పో A38 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
6.56-అంగుళాల HD+ (1612×720 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేతో, ఒప్పో A38 రిఫ్రెష్ రేట్ 90Hz, గరిష్ట ప్రకాశం లెవల్ 720 నిట్స్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 13-ఆధారిత ColorOS 13.1తో డ్యూయల్ నానో SIM-సపోర్టుతో వస్తుంది. ఈ ఫోన్ 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో ఆక్టా-కోర్ MediaTek Helio G85 SoC ద్వారా పవర్ అందిస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఒప్పో A38 డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ 50MP AI-బ్యాక్డ్ ప్రైమరీ సెన్సార్, 2MP సెకండరీ సెన్సార్‌తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 5MP సెన్సార్‌తో వస్తుంది.

ఒప్పో A38 ఫోన్ 33W వైర్డు SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. సెక్యూరిటీ విషయానికి హ్యాండ్‌సెట్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఫేస్ రికగ్ననైజేషన్ ఫీచర్ కూడా సపోర్టు ఇస్తుంది. WiFi 5, బ్లూటూత్ 5.3, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-C పోర్ట్‌ను పొందుతుంది. ఈ డివైజ్బరువు 190 గ్రాములు, 163.74mm x 75.03mm x 8.16 mm పరిమాణం కలిగి ఉంటుంది.

Read Also : Jio AI Cloud Infrastructure : భారత్‌కు అత్యాధునిక AI క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌.. NVIDIAతో జియో భాగస్వామ్యంపై అంబానీ ఏమన్నారంటే?

ట్రెండింగ్ వార్తలు