Oppo Find N3 Flip, Oppo Watch 4 Pro Launch Date Set for August 29, Design Teased_ Details
Oppo Find N3 Flip : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో (Oppo) నుంచి ఒప్పో Find N3 ఫ్లిప్ ఫోన్ రాబోతోంది. ఈ నెల (ఆగష్టు) 29న అధికారికంగా లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ ధృవీకరించింది. ఒప్పో ఫోన్ తయారీదారు నెక్స్ట్ లాంచ్ ఈవెంట్లో ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్ అప్‌గ్రేడ్ వెర్షన్ ఆవిష్కరించడానికి రెడీగా ఉంది. రాబోయే క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్‌తో పాటు, కంపెనీ (Oppo Watch 4 Pro)ని కూడా లాంచ్ చేయనుంది. లాంచ్‌కు ముందు, రాబోయే ఒప్పో Find N3 ఫ్లిప్, ఒప్పో వాచ్ 4 ప్రో ఫొటోలను కంపెనీ షేర్ చేసింది. ఈ రెండు డివైజ్‌ల నుంచి ఏయే ఫీచర్లు ఉంటాయి అనేది ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం..
(Weibo)లో (Oppo Find N3 Flip)ను ఆగస్టు 29న చైనాలో లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం 2 గంటలకు (11:30 am IST) జరుగుతుందని చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వెల్లడించింది. Find N3 ఫ్లిప్‌తో పాటు, ఒప్పో వాచ్ 4 Pro కూడా అదే తేదీన లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఒప్పో ఫైండ్ N3 ఫ్లిప్ లాంచ్ పోస్టర్లతో పాటు, కంపెనీ చైనాలో తమ అరంగేట్రానికి ముందు ఫోన్, స్మార్ట్ వాచ్ ఫొటోలను పోస్ట్ చేసింది.
ఒప్పో Find N3 ఫ్లిప్ ఫొటోలు పరిశీలిస్తే.. ఇతర పోటీదారుల కన్నా చిన్నవిగా కనిపిస్తున్నాయి. నిలువు కవర్ స్క్రీన్‌తో క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్ మాదిరిగా ఉన్నాయి. (Motorola Razr 40 Ultra), Samsung Galaxy Z Flip 5, OnePlus ఫోన్లలో కనిపించే ట్రై-స్టేట్ అలర్ట్ స్లయిడర్ ఈ ఫోన్ ఎడమ వైపున ఉంటుంది. ఒప్పో Find N3 ఫ్లిప్ ఫొటోలు వెనుక కెమెరా మాడ్యూల్‌ను కూడా కలిగి ఉన్నాయి.
Oppo Find N3 Flip, Oppo Watch 4 Pro Launch Date Set for August 29, Design Teased_ Details
ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని సూచిస్తుంది. కెమెరా వృత్తాకార హౌసింగ్ హాసెల్‌బ్లాడ్ బ్రాండింగ్‌ను కూడా కలిగి ఉంది. కంపెనీ గత ఏడాదిలో హాసెల్‌బ్లాడ్‌తో 3 ఏళ్ల భాగస్వామ్యాన్ని ప్రకటించినట్లు నివేదిక తెలిపింది. రెండు సంస్థలు కలిసి సంయుక్తంగా ఫ్లాగ్షిప్ ఫైండ్ సిరీస్‌లో కెమెరా టెక్నాలజీని అభివృద్ధి చేస్తాయి.
ఇంతలో, ఒప్పో వాచ్ 4 ప్రో గత ఏడాదిలో వాచ్ 3 ప్రో మాదిరిగానే దీర్ఘచతురస్రాకార డిజైన్, యాష్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో మెటల్ ఛాసిస్‌తో కనిపిస్తుంది. వేరబుల్ మరో బటన్‌తో పాటు బిగ్ క్రౌన్ బటన్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఒప్పో వాచ్ 4 ప్రో రెండు స్ట్రాప్ ఆప్షన్లలో రానుంది. ఆగస్ట్ 29 న ఫైండ్ N3 ఫ్లిప్‌తో పాటు లాంచ్ కానుందని కంపెనీ తెలిపింది.