Realme 11 5G Launch : అద్భుతమైన ఫీచర్లతో రియల్‌మి 11 5G ఫోన్ వస్తోంది.. 47 నిమిషాల్లో 100శాతం ఛార్జింగ్.. గెట్ రెడీ..!

Realme 11 5G Launch : రియల్‌మి నుంచి సరికొత్త 5G ఫోన్ రాబోతోంది. ఈ ఫోన్ కేవలం 17 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్, 47 నిమిషాల్లో 100 శాతం బ్యాటరీని పొందగలదని కంపెనీ పేర్కొంది.

Realme 11 with 108MP camera, 67W charging confirmed ahead of official India launch

Realme 11 5G Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి (Realme) నుంచి సరికొత్త 5G ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ కానుంది. గత జూన్ 2023లో దేశంలో Realme 11 Pro సిరీస్‌ను ఆవిష్కరించిన తర్వాత రియల్‌మి త్వరలో (Realme 11), Realme 11X ఫోన్ లాంచ్ చేయనుంది. అధికారిక లాంచ్‌కు ముందు.. రియల్‌మి రెగ్యులర్ Realme 11 5G ఫోన్ 108MP ప్రైమరీ కెమెరా, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉందని ధృవీకరించింది. రియల్‌మి 11X 5G ఫోన్ కూడా హై-స్పీడ్ 5G బ్రౌజింగ్ స్పీడ్‌కు సపోర్ట్‌తో ఇదే విధమైన ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌ని కలిగి ఉంది. భారతీయ మార్కెట్లోకి రాబోయే ఫోన్‌ల లాంచ్ తేదీని రియల్‌మి ఇంకా ప్రకటించలేదు.

రియల్‌మి 11 ప్రైమరీ కెమెరా శాంసంగ్ HM6 సెన్సార్‌ను ఉపయోగిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ 3x ఇన్-సెన్సార్ జూమ్‌ను అందిస్తుంది. 3X ఆప్టికల్ జూమ్‌తో జూమ్-ఇన్ షాట్‌లను క్యాప్చర్ చేయొచ్చు. రియల్‌మి ఇమేజ్‌ల ప్రాసెసింగ్ స్పీడ్, మెరుగైన ఫోకస్‌ని కూడా అందిస్తుంది. HM2 సెన్సార్‌తో కూడిన డివైజ్‌ల కన్నా 9 రెట్లు ఎక్కువ ఫోకస్ కచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది. కెమెరాలో ట్రాంక్విల్, క్రిస్ప్, సినిమాటిక్ వంటి కొత్త ఫిల్టర్‌లు కూడా ఉంటాయి.

Read Also : Realme C53 Launch : 108MP ప్రైమరీ కెమెరాతో రియల్‌మి C53 ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఫస్ట్ సేల్ ఎప్పుడో తెలుసా?

67W ఛార్జింగ్ స్పాడ్ అనేది రియల్‌మి 11 5G ఫోన్ 17 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్, 47 నిమిషాల్లో 100 శాతం బ్యాటరీని పొందగలదని రియల్‌మి పేర్కొంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. లాంచ్‌కు ముందు.. రియల్‌మి 11 5G డిజైన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందిస్తుంది. ఈ ఫోన్ iPhone 12 ఫ్లాట్ ఎడ్జ్ కలిగి ఉంది. పవర్ బటన్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్, దిగువన 3.5mm ఆడియో జాక్‌ని కూడా కలిగి ఉండనుంది. ముందు భాగంలో సెల్ఫీ కెమెరాలో హోల్-పంచ్ కటౌట్ ఉంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ రియర్ కెమెరాల కోసం రౌండ్ మాడ్యూల్ ఉంటుంది.

Realme 11 with 108MP camera, 67W charging confirmed ahead of official India launch

భారత్‌కు రానున్న రియల్‌మి 11 5G ఫోన్ గత నెలలో తైవాన్‌లో లాంచ్ చేసిన Realme 11 5G ఫోన్ మాదిరిగా ఫీచర్లను కలిగి ఉందని అధికారిక పోస్టర్ సూచిస్తుంది. 8GB వరకు RAM, 256GB స్టోరేజీతో MediaTek డైమెన్సిటీ 6100+ SoC నుంచి ఫోన్ పవర్ అందిస్తుంది. బ్యాక్ ప్యానెల్‌లో f/2.4 ఎపర్చరు, 89.1-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూతో 2MP సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌ కోసం Realme 11 5G ఫోన్ 16MP కెమెరాతో f/2.45 ఎపర్చర్‌తో వస్తుంది.

ఇతర ఫీచర్లలో 120Hz రిఫ్రెష్ రేట్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.2, NFCతో కూడిన 6.72-అంగుళాల ఫుల్-HD+ AMOLED డిస్‌ప్లే ఉన్నాయి. మరోవైపు, Realme 11X 5G కూడా 91Mobiles ద్వారా షేర్ చేసిన రెండర్ ఆధారంగా ఇలాంటి డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వేరే ప్రాసెసర్‌ని ఉపయోగించవచ్చు. Realme 11, Realme 11X ఫోన్ భారత మార్కెట్లో రూ. 20వేల లోపు ఉండవచ్చని అంచనా. ఈ ఫోన్‌లు Xiaomi కొత్త Redmi 12 సిరీస్, Samsung Galaxy M14 లకు పోటీదారుగా మార్కెట్లో ఉంటాయి.

Read Also : Samsung Galaxy M14 5G Price : శాంసంగ్ గెలాక్సీ M14 5G ధర తగ్గిందోచ్.. కేవలం రూ. 12,490కే సొంతం చేసుకోండి..!

ట్రెండింగ్ వార్తలు