Realme C53 Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? చైనా దిగ్గజం రియల్‌మి నుంచి సరికొత్త ఎంట్రీ-లెవల్ ఫోన్ (Realme C53) భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 108MP కెమెరాతో పాటు 6GB వరకు RAM, 90Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీని కూడా అందిస్తుంది. రియల్‌మి C53 ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ఓసారి పరిశీలిద్దాం.
రియల్‌మి C53 రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 11,000 లోపు ఉంటుంది. బేస్ మోడల్ 4GB RAM, 128GB స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.9,999కు అందిస్తుంది. 6GB RAM, 64GB స్టోరేజీతో కూడిన వేరియంట్ కూడా ఉంది. ఈ ఫోన్ ధర రూ.10,999 కు సొంతం చేసుకోవచ్చు. రియల్‌మి C53 ఫస్ట్ సేల్ జూలై 26న మధ్యాహ్నం 12 గంటలకు షెడ్యూల్ చేసింది. దీని ప్రకారం.. ఈ రియల్‌మి C53 ఫోన్‌ను కంపెనీ వెబ్సైట్ realme.com, Flipkart రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. Realme 6GB + 64GB వేరియంట్‌పై రూ. వెయ్యి వరకు డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఛాంపియన్ గోల్డ్, ఛాంపియన్ బ్లాక్ అనే 2 కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది.
రియల్‌మి C53 స్పెసిఫికేషన్లు :
రియల్‌మి C53 స్పెసిఫికేషన్లకు సంబంధించి 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల HD డిస్ప్లేను కలిగి ఉంది. సున్నితమైన స్క్రోలింగ్, అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది. ఈ ఫోన్ UNISOC T612 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రోజువారీ పనులకు బెటర్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. రియల్‌మి C53 ర్యామ్, స్టోరేజ్ పరంగా 2 వేరియంట్లలో వస్తుంది. 4GB RAM, 128GB స్టోరేజీ లేదా 6GB RAM, 64GB స్టోరేజీ మధ్య ఎంచుకోవచ్చు. అదనంగా, ఈ ఫోన్లో 12GB డైనమిక్ RAM అందిస్తుంది. మల్టీ టాస్కింగ్, యాప్‌లను అందిస్తుంది.
కెమెరా విషయానికి వస్తే.. రియల్‌మి C53 ఫోన్ 108MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఫొటోగ్రఫీ సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు B&W లెన్స్‌ను కూడా కలిగి ఉంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ పెద్ద 5,000mAh బ్యాటరీతో వస్తుంది. రోజంతా సరిపోయేంత పవర్ అందిస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ డివైజ్ త్వరగా ఛార్జ్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.
సాఫ్ట్వేర్ పరంగా.. రియల్‌మి C53 ఫోన్ Android 13 ఆధారంగా realme UIT ఎడిషన్‌పై రన్ అవుతుంది. యూజర్-ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ లేటెస్ట్ ఫీచర్లు, అప్డేట్లకు యాక్సెస్‌ను అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా రియల్‌మి C53 ఫోన్ 4G LTE, బ్లూటూత్ 5.0, Wi-Fi, USB టైప్-C పోర్ట్, సేఫ్ అన్లాకింగ్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. మొత్తంమీద, రియల్‌మి C53 ఫోన్ హై-రిజల్యూషన్ కెమెరా, స్మూత్ డిస్ప్లే, లాంగ్ బ్యాటరీ లైఫ్, అద్భుతమైన స్టోరేజీ ఆప్షన్లతో కూడిన ఫీచర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్ అందిస్తుంది. ప్రత్యేకించి సరసమైన ధరకు సొంతం చేసుకోవచ్చు.