Vivo V29e Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం (Vivo) నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. భారతీయ మార్కెట్లో త్వరలో Vivo V29e లాంచ్ చేయనుంది. వివో ఇండియా వెబ్సైట్లో ఈ కొత్త ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్లకు సంబంధించి ప్రత్యేక ల్యాండింగ్ పేజీని సూచిస్తుంది. వివో V29e కలర్ మార్చే బ్యాక్ ప్యానెల్‌తో డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 64MP ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంది. 7.57mm సన్నని ప్రొఫైల్‌ను కలిగి ఉంది. Vivo V29e హోల్ పంచ్ డిస్ప్లే డిజైన్‌ను కూడా కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది.
Read Also : Vivo Y35 Discount : అమెజాన్‌లో వివో Y35 ఫోన్‌పై అదిరే డిస్కౌంట్.. ఇప్పుడే సొంతం చేసుకోండి..!
టీజర్ పేజీ ప్రకారం.. Vivo V29e OISకి సపోర్టుతో 64MP ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో చాట్లకు హ్యాండ్సెట్ 50MP ఫ్రంట్ కెమెరాను అందించనుంది. మైక్రోసైట్‌లోని రెండర్లు హ్యాండ్సెట్ 3D కర్వ్డ్ స్క్రీన్‌ను సూచిస్తాయి. రూ. 58.7-డిగ్రీల స్క్రీన్ కర్వేచర్‌తో 3D కర్వ్డ్ స్క్రీన్‌తో అత్యంత సన్నగా ఉండనుంది. రూ. 25వేల నుంచి రూ. 30వేల ధర విభాగంలో రానుంది. అన్ని వైపులా స్లిమ్ బెజెల్స్‌తో కనిపిస్తుంది. టాప్ హోల్ పంచ్ కటౌట్‌పై ఫ్రంట్ కెమెరాతో రానుంది.
వెనుకవైపు, వివో V29e రంగులు మారే గ్లాస్ ప్యానెల్‌తో వస్తుంది. ఈ టెక్నాలజీ రిచ్ కలర్లను మరింత ఆకర్షణీయమైన మార్చనుంది. ఆర్టిస్టిక్ రెడ్, ఆర్టిస్టిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఉండనుంది. కలర్లు మార్చే టెక్నాలజీతో కళాత్మక రెడ్ వేరియంట్‌కు ప్రత్యేకంగా ఉంటుంది. వివో V29e ఫోన్ 7.57mm సన్నని ప్రొఫైల్‌ను కలిగి ఉంది. 180.5 గ్రాముల బరువు కూడా ఉంటుంది. గత లీక్ ప్రకారం.. వివో V29e ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజీ, 8GB RAM + 256GB స్టోరేజీ ఆప్షన్లలో వస్తుంది.
ఆండ్రాయిడ్ 13-ఆధారిత FunTouchOS 13లో రన్ అవుతుంది. హ్యాండ్సెట్ స్నాప్‌డ్రాగన్ 480 5G SoC లేదా స్నాప్‌డ్రాగన్ 480+ 5G SoC ద్వారా పవర్ అందిస్తుంది. 80W ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,600mAh బ్యాటరీ అందించనుంది. ఈ ఏడాది జూన్‌లో చెక్ రిపబ్లిక్లో లాంచ్ చేసిన Vivo V29 Lite 5Gకి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా భావిస్తున్నారు. భారత మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ అందుబాటులోకి రానుంది.