Poco F6 Deadpool : కొత్త ఫోన్ కొంటున్నారా? పోకో ఎఫ్6 డెడ్‌పూల్ లిమిటెడ్ ఎడిషన్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు వివరాలివే!

Poco F6 Deadpool Limited : పోకో ఎఫ్6 డెడ్‌పూల్ లిమిటెడ్ ఎడిషన్ సింగిల్ 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,999, ప్రత్యేక బ్యాంక్ ఆఫర్ రూ. 4వేలు ప్రభావవంతమైన ధరను రూ. 29,999కు అందిస్తోంది.

Poco F6 Deadpool Limited Edition Launched ( Image Source : Google )

Poco F6 Deadpool Limited : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో నుంచి పోకో ఎఫ్6 డెడ్‌పూల్ లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ అయింది. ఈ పోకో ఫోన్ డెడ్‌పూల్ నుంచి ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంది. మార్వెల్ సూపర్ హీరో ఐకానిక్ రెడ్, బ్లాక్ కలర్ స్కీమ్‌తో వస్తుంది. కెమెరా ఐలాండ్‌లో డెడ్‌పూల్ లోగోను కలిగి ఉంది.

Read Also : Viral Video : కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ తింటున్న ఓలా డెలివరీ ఏజెంట్.. వీడియో వైరల్.. నెటిజన్ల రియాక్షన్!

దేశంలో పోకో ఎఫ్6 డెడ్‌పూల్ లిమిటెడ్ ఎడిషన్‌ను లాంచ్ చేసేందుకు పోకో మార్వెల్ స్టూడియోస్‌తో కలిసి పనిచేసింది. ఈ కొత్త హ్యాండ్‌సెట్ లాంచ్ డెడ్‌పూల్, వుల్వరైన్ ఫొటో థియేట్రికల్ లాంచ్ కూడా సూచిస్తుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ఎస్ఓసీతో రన్ అవుతుంది. 50ఎంపీ డ్యూయల్ బ్యాక్ కెమెరాలను కలిగి ఉంది.

భారత్‌లో పోకో F6 డెడ్‌పూల్ లిమిటెడ్ ఎడిషన్ ధర :
పోకో ఎఫ్6 డెడ్‌పూల్ లిమిటెడ్ ఎడిషన్ సింగిల్ 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,999, ప్రత్యేక బ్యాంక్ ఆఫర్ రూ. 4వేలు ప్రభావవంతమైన ధరను రూ. 29,999కు అందిస్తోంది. ఆగస్ట్ 7 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ విక్రయించనుంది. పోకో ఎఫ్6 ఫోన్ బేస్ వెర్షన్ 8జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999, 12జీబీ ర్యామ్ + 256జీబీ, 12జీబీ + 512జీబీ ఆప్షన్ల ధర వరుసగా రూ. 31,999, రూ. 33,999కు అందుబాటులో ఉంది.

పోకో ఎఫ్6 డెడ్‌పూల్ లిమిటెడ్ ఎడిషన్ స్పెసిఫికేషన్‌లు :
పోకో ఎఫ్6 డెడ్‌పూల్ లిమిటెడ్ ఎడిషన్ డెడ్‌పూల్ ట్రేడ్‌మార్క్ రెడ్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. బ్యాక్ ప్యానెల్‌లో అనేక డెడ్‌పూల్, వుల్వరైన్ యాక్సెంట్‌లను కలిగి ఉంది. డిజైన్‌తో పాటు ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్ ఇంటర్నల్‌లు స్టాండర్డ్ వెర్షన్‌ను పోలి ఉంటాయి. ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్‌ఓఎస్ ఇంటర్‌ఫేస్‌పై రన్ అవుతుంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల 1.5K (1,220×2,712 పిక్సెల్‌లు) రిజల్యూషన్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

12జీబీ ఎల్‌పీపీడీడీఆర్5ఎక్స్ ర్యామ్‌తో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ఎస్ఓసీ ద్వారా అందిస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. పోకో ఎఫ్6 డెడ్‌పూల్ లిమిటెడ్ ఎడిషన్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో 50ఎంపీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాట్‌లకు 20ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. 90డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్‌లో 120డబ్ల్యూ అడాప్టర్‌తో వస్తుంది.

Read Also : Zomato Delivery Boy : ఉండేది ముంబై మురికివాడలో.. నెలకు అద్దె రూ. 500.. జొమాటో డెలివరీ బాయ్ రియల్ లైఫ్ స్టోరీ..!

ట్రెండింగ్ వార్తలు