Whatsapp 3 Tick : వాట్సాప్‌లో మూడో బ్లూ టిక్‌.. ఆ వార్త ఫేక్..!

ప్రముఖ వాట్సాప్ మెసేజింగ్ యాప్ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. యూజర్ల ప్రైవసీపరంగా వాట్సాప్ అనేక చర్యలు తీసుకుంటోంది. WaBetainfo క్లారిటీ ఇచ్చింది

Whatsapp 3 Tick : ప్రముఖ వాట్సాప్ మెసేజింగ్ యాప్ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. యూజర్ల ప్రైవసీపరంగా వాట్సాప్ అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే యూజర్ల ప్రైవసీ దృష్ట్యా అనేక ఫీచర్లను తీసుకొస్తోంది. ఇప్పటికే వాట్సాప్ చాట్ బాక్సులో యూజర్లు ఏదైనా మెసేజ్ పంపినప్పుడు సింగిల్ టిక్ కనిపిస్తుంటుంది. అంటే.. అది మెసేజ్ సక్సెస్ ఫుల్ గా సెండ్ అయిందని అర్థం. అదే రెండు టిక్ మార్క్స్ కనిపిస్తే.. మెసేజ్ డెలివరీ అయిందని అర్థం. ఆ రెండు టిక్స్ బ్లూ కనిపిస్తే.. యూజర్ చూశారని అర్థం.. ఇంతవరకు అందరికి తెలిసిందే.

అయితే.. వాట్సాప్ ఇప్పుడు మరో మూడో టిక్ ఫీచర్ ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ మూడో టిక్.. ప్రత్యేకించి స్ర్కీన్ షాట్లను డిటెక్ట్ చేసేందుకు ఉపయోగపడుతుందని ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై WaBetainfo క్లారిటీ ఇచ్చింది. అదంతా ఫేక్ న్యూస్ అంటూ ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే మూడో టిక్ అనే వార్త ఫేక్ న్యూస్ అని.. ఎవరూ నమ్మొద్దని సూచించింది. వాట్సాప్‌లో తీసిన స్ర్కీన్ షాట్లను డిటెక్ట్ చేసేందుకు వాట్సాప్ మూడో బ్లూ టిక్ చెక్ (Third Blue Check) ఫీచర్ డెవలప్ చేయడం లేదని WaBetainfo ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది.


వాట్సాప్ మీడియా షేరింగ్ లేదా స్ర్కీన్ షాట్ ఎవరూ తీశారో డిటెక్ట్ చేసే మెథడ్ ఇప్పటివరకూ వాట్సాప్ డెవలప్ చేయలేదని పేర్కొంది. కాకపోతే వాట్సాప్‌లో యూజర్ల కోసం Business nearby అనే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనున్నట్టు మెసేజింగ్ యాప్ ఒక ప్రకటనలో వెల్లడించివంది. ఇందుకోసం బిజినెస్ సెక్షన్ ఒకటి తీసుకు రానుంది. అందులో కొత్త ఇంటర్ ఫేస్ కూడా ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త ఇంటర్ ఫేస్ సాయంతో యూజర్లు తమ బిజినెస్ లొకేషన్ ఫిల్టర్ చేసుకోవచ్చు. అంటే.. యూజర్లు తమ దగ్గరలోని హోటల్స్, గ్రాసరీలు, షాపింగ్, క్లాతింగ్ వంటివి సులభంగ సెర్చ్ చేసుకోవచ్చు.

Also Read : Whatsapp : వాట్సాప్‍‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఒక్కసారి మాత్రమే చూడొచ్చు..!

ట్రెండింగ్ వార్తలు