Road Accident : ఎస్‌ఐ పరీక్ష రాసి, తమ్ముడి పెళ్లికి వెళ్తుండగా విషాదం – రోడ్డు ప్రమాదంలో అన్న మృతి

హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష రాసి, తమ్ముడి పెళ్లికి వెళ్తున్న అన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. యువకుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

road accident : హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష రాసి, తమ్ముడి పెళ్లికి వెళ్తున్న అన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన జీడిమెట్లలో ఆదివారం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఆంజనేయులు అనే యువకుడు ఇవాళ ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష రాశాడు. అనంతరం బైక్ పై తమ్ముడి పెళ్లికి వెళ్తున్నాడు. జీడిమెట్ల టీఎస్‌ఐఐసీ కాలనీలో బైక్ పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ట్యాంకర్‌ ఢీకొట్టింది.

Kerala Man: స్కేట్‌బోర్డుపై కాశ్మీర్ యాత్ర చేస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

దీంతో ఆంజనేయులుకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందాడు. యువకుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లి ఇంట తీరని విషాదాన్ని నింపింది.

ట్రెండింగ్ వార్తలు