Amit Shah: తెలంగాణలో ఈ సారి సీఎం అయ్యేది కేసీఆర్ కాదు, కేటీఆర్ కాదు..ఆయనే..: అమిత్ షా

బీఆర్ఎస్ కారు స్టీరింగ్‌ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేతుల్లో ఉందని అన్నారు.

Amit Shah - BJP

Amit Shah – BJP: తెలంగాణలో ఈ సారి సీఎం అయ్యేది కేసీఆర్ (KCR) లేదా కేటీఆర్ (KTR) కాదని బీజేపీ నేతనే సీఎం అవుతారని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఇవాళ బీజేపీ ఖమ్మంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఇక్కడి నుంచే బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ సభను రైతు గోస-బీజేపీ భరోసా పేరిట నిర్వహించారు.

అమిత్ షా మాట్లాడుతూ… తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ సోనియా గాంధీ కుటుంబం కోసమే పనిచేస్తుంటే, బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం కోసం పనిచేస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్‌ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేతుల్లో ఉందని అన్నారు.

సీఎం కేసీఆర్ భద్రాచలంలోని రాముడి వద్దకు ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. బీజేపీ గెలుస్తుందని, తమ పార్టీ సీఎం భద్రాచలం వెళతారని, రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అన్నారు. కాంగ్రెస్ 4జీ పార్టీ అయితే, బీఆర్ఎస్ 2జీ పార్టీ అని ఎద్దేవా చేశారు. చివరకు ధాన్యం కొనుగోళ్లపై కూడా కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

Vijayasai Reddy: పుష్ప సినిమాలో అందుకే చంద్రబాబు ఫొటో పెట్టారు: విజయసాయిరెడ్డి

ట్రెండింగ్ వార్తలు