Komati Reddy Rajagopal Reddy : కాంగ్రెసులో క్లైమాక్స్ కు చేరిన రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్..సస్పెన్షన్ కు రంగం సిద్ధం

బీజేపీలోకి చేరటానికి మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటుంటే కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై సీరియస్ గా ఉంది. దీంతో రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేయటానికి రంగం సిద్ధం చేసింది.

Congress is ready to suspend MLA Komati Reddy Rajagopal Reddy : కాంగ్రెస్ కు హ్యాండిచ్చి బీజేపీలోకి చేరటానికి మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారు. కాషాయ కండువా కప్పుకోవటానికి ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు పార్టీ మార్పు విషయంలో ఎంతమంది సీనియర్ నాయకులు ఎంతగా నచ్చ చెప్పినా రాజగోపాల్ రెడ్డి కాషాయగూటికే చేరేందుకు సిద్ధమయ్యారు.దీంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా రాజగోపాల్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయటానికి రంగం సిద్ధం చేసింది. ఇటువంటి బీజేపీలో చేరకకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రంగం సిద్ధం చేసుకుంటుంటే..మరోవైప్ కాంగ్రెస్ కూడా సదరు ఎమ్మెల్యేపై సస్పెండ్ చేయటానికి రెడీ అవుతోంది.రాజగోపాల్ సస్పెన్షన్ పై నల్లగొండ జిల్లా నేతలతో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో ఏ క్షణమైనా రాజగోపాల్ పై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయనుంది కాంగ్రెస్ అధిష్టానం. షోకాజ్ నోటీ లేకుండానే డైరెక్ట్ గా సస్పెండ్ చేయటానికి రంగం సిద్ధం చేస్తోంది.

కానీ కాంగ్రెస్ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా రాజగోపాల్ రెడ్డి మాత్రం తన దూకుడు కొనసాగిస్తున్నారు. దాన్ని బీజేపీ చక్కగా సద్వినియోగం చేసుకుంటోంది. రాజగోపాల్ రెడ్డితో తెలంగాణ బీజేపీ నేతలు చర్చలు సాగించటానికి ఈరోజు సాయంత్రం ఆయన నివసానికి చేరుకుంటున్నారు. చర్చలు జరిపేందుకు తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్…ల్యాండ్ కబ్జా ఆరోపణలతో టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి మంత్రి పదవిని కూడా వదిలేసుకుని బీజేపీలో జాయిన్ అయి..మరోసారి పోటీలో నిలిచి హుజూరాబాద్ స్థానాన్ని దక్కించుకున్న ఈటల రాజేందర్, వివేక్ రాజగోపాల్ రెడ్డితో చర్చలు జరుపనున్నారు. స్థానికంగా చర్చలు ముగిసాక బీజేపీ నేతలు రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీ పెద్దల వద్దకు తీసుకెళ్లనున్నారు. బీజేపీలోకి లైన్ క్లియర్ అయ్యాక ఇక రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో మునుగోడు నియోజక వర్గానికి ఉప ఎన్నిక రానుంది. మరి ఆ ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినే బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టనుందో లేదో తెలియాలి.

Also read : Komatireddy Rajagopal Reddy : బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి చేరిక ఖరారు..మునుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధం

ఇలా బీజేపీకి అధికారికంగా చేరేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్ని విధాలుగా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక లాంఛనంగా చేరిపోవటమే ఖాయంగా ఉంది. అన్ని చర్చలు పూర్తి అయ్యాక బహుశా వచ్చే ఆగస్టులో రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలోని తన అనుచరులు, కార్యకర్తలను రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్ పిలిపించుకుని వరుస భేటీలు జరుపుతున్నారు. పార్టీ మారినా నియోజకవర్గంలో పట్టు సడలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాక గతంలో హుజురాబాద్ మాదిరిగానే మునుగోడుకు కూడా ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉన్న తరుణంలో మునుగోడుకు ఉపఎన్నిక జరిగితే అది తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే 2023లో అధికారం తమదేనని ప్రచారం చేసుకోవడానికి మరింత స్కోప్ ఏర్పడుతుంది. కాబట్టి రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించి ఉపఎన్నికకు వెళ్లేందుకు బీజేపీ పక్కా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు