Telangana Rains
తెలంగాణలో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ఆవర్తనం ఒకటి పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఏర్పడిందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా తూర్పు దిశ నుంచి వీస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అన్నారు. రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఇవాళ, రేపు కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి. మీ., వేగంతో, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 – 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు. నైరుతి రుతుపవనాలు కూడా ఈ ఏడాది తొందరగానే వస్తున్నాయని ఇప్పటికే ఐఎండీ తెలిపింది.
మే నెలలో సాధారణంగా ఎండలు దంచికొడతాయి. ఈ సారి కాస్త త్వరగానే నైరుతి రుతుపవనాలు వస్తాయన్న సూచనలు ఊరటనిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో వర్షాకాలం ప్రారంభమైందని భావిస్తారు.
Also Read : రిటైర్‌మెంట్ ప్రకటించనున్న రోహిత్ శర్మ? ఫామ్‌లో లేకపోయిన పాండ్య ఎంపిక అందుకేనా?