Ambati Rambabu
పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై సీఈవో మేకేశ్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు. అనంతరం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పల్నాడులో హింసాత్మక ఘటనలు జరిగాయని చెప్పారు.
గతంలో ఎన్నడూ జరగనంత అధ్వానంగా అక్కడ ఎన్నికలు జరిగాయని అంబటి రాంబాబు తెలిపారు. పోలీసుల తీరు బాగోలేదని అన్నారు. అభ్యర్థులను తిరగొద్దని చెప్పారని, దీంతో తాను వెళ్లిపోయానని చెప్పారు.
కానీ, తన ప్రత్యర్థి మాత్రం ఆ ప్రాంతాల్లో తిరిగారని అంబటి రాంబాబు తెలిపారు. ఆరు బూత్ లలోని వెబ్ కెమెరాలను అధికారులు పరిశీలించాలని ఆయన చెప్పారు. ఆయా బూత్ లలో రీ పోలింగ్ నిర్వహించాలని కోరినట్లు తెలిపారు.
కొత్తగణేశం పాడు గ్రామంలో తెలుగు దేశం పార్టీ దాడులు చేస్తోందని అంబటి రాంబాబు అన్నారు. పురుషులు అందరూ ఊరు విడిచి వెళ్లిపోయారని, గుళ్లల్లో మహిళలు దాక్కున్నారని అన్నారు. మహిళల మీద దాడులు చేస్తున్నారని తెలిపారు. పల్నాడు జిల్లాలో పరిస్థితులు బాగోలేవని చెప్పారు.
Also Read: మండి లోక్‌సభ స్థానం నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నామినేషన్