Telangana Assembly : ఫోటోల కోసమే పనిచేస్తున్నామా? అంటూ కేంద్రంపై భట్టి ఫైర్ .. కాంగ్రెస్ నేత విమర్శలపై సర్వత్రా ఆసక్తి

ఫోటోల కోసమే పనిచేస్తున్నామా? అంటూ కేంద్రంపై భట్టి ఫైర్ .. అసెంబ్లీలో సీఎల్పీ నేత..కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క కేంద్రం చేసిన విమర్శలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే భట్టి ప్రసంగాన్ని సీఎం కేసీఆర్ పొగటమే కాదు..ఇంకా

Telangana Assembly : కేంద్ర విద్యుత్ బిల్లుపై తెలంగణ అసెంబ్లీలో చర్చ కొనసాగుతున్న క్రమంలో సీఎల్పీ నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డరు. కేంద్ర విద్యుత్ బిల్లులును వ్యతిరేకిస్తూ తీవ్ర విమర్శలు చేశారు భట్టి. తెలంగాణలో బీజేపీ మంత్రులు పర్యటించిన క్రమంలో మంత్రి నిర్మలా సీతారామన్ రేషన్ షాపుల వద్ద ప్రధాని మోడీ ఫోటో పెట్టాల్సిందేనంటూ చేసిన వ్యవహారంపై భట్టి స్పందిస్తూ ‘ఫోటోల కోసం పనిచేస్తున్నామ? అంటూ సెటైర్ వేశారు. రేషన్ షాపుల వద్ద మోడీ ఫోటో ఎందుకు పెట్టాలి? అంటూ ప్రశ్నించారు. ఇదేనా డబుల్ ఇంజన్ సర్కారు చేసే పనులు అంటూ ఎద్దేవా చేశారు. భట్టి చేసిన ఈ విమర్శలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే అసెంబ్లీలో రాష్ట్రప్రభుత్వాన్ని విమర్శించకుండా నేరుగ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలేంటీ అనే కొత్త ఆసక్తిని కలిగిస్తున్నాయి భట్టి విక్రమార్క విమర్శలు. భట్టి కేంద్రంపై విమర్శలు చేస్తుంటే సీఎం కేసీఆర్ భట్టిని పొగిడారు. టీఆర్ఎస్ నేతలు భట్టికి వంత పాడారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భట్టి విక్రమార్క సభలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి కేంద్రాన్ని విమర్శించడం చర్చనీయాంశమైంది. విద్యుత్ సవరణ బిల్లుపై కేంద్రం నిర్ణయాన్ని తప్పుపట్టిన భట్టీ విక్రమార్క…ట్యాక్సుల రూపంలో పేదలు కట్టే డబ్బును మోడీ ప్రభుత్వం ఆయన సన్నిహితులైన ఒకరిద్దరికి కట్టబెడుతూ దేశ ప్రజల్ని తీవ్రంగా నష్టపరుస్తోందని విమర్శలు గుప్పించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా పనిచేయాలంటూ సూచించారు. అంతేకాదు రేషన్ షాపుల వద్ద ప్రధాని మోడీ ఫోటో ఎందుకు లేదని కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తంచేసిన మంత్రి నిర్మలా సీతారామన్ ఐటీఆర్ ప్రాజెక్టు పంపిస్తానని చెప్పాల్సింది అంటూ విమర్శించారు భట్టి.దేశాన్ని అమ్మేలా వ్యవహరించే బీజేపీ విధానలు విడనాడాలి అంటూ ఎంతసేపు బీజేపీపైనే విమర్శలు చేశారు తప్ప రాష్ట్రప్రభుత్వంపై విమర్శించే పనిపెట్టుకోలేదు భట్టి.

కేంద్రంలో ఉన్న బీజేపీ పాలకులు నియంత పోకడంతో వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క. రాష్ట్రాల వాదనను, స్థానిక ప్రభుత్వాల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా మేం చెప్పిందే అమలు చేయాలనే విధంగా వ్యవహరించడం దారుణమని అసెంబ్లీలో విమర్శలు సంధించారు. వ్యవసాయ విద్యుత్‌ మోటర్లకు మీటర్లు బిగించడం ఎక్కడి నిర్ణయమని భట్టి తప్పు పట్టారు. ఇక విభజన చట్టం హామీలు, రాష్ట్రానికి కేటాయించిన నిధులు, అభివృద్ధి తాలుక అంశాలపై చర్చించకుండా ..కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రేషన్ డీలర్ షాపులో మోదీ ఫోటో పెట్టలేదని కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంపై భట్టి వ్యంగ్యస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సభలో వ్యవహార శైలి ఆసక్తికరంగా ఉంది. భట్టి ప్రసంగాన్ని విన్న సీఎం కేసీఆర్ భట్టిని పొగిడారు.

 

ట్రెండింగ్ వార్తలు