Raja Singh: అవసరమైతే రాజకీయాలనుంచి తప్పుకుంటా.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ అధిష్టానం నాపై సానుకూలంగా ఉంది. సరైన సమయం చూసి నాపై సస్పెన్షన్‌వేటు ఎత్తివేస్తారని రాజాసింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

MLA Raja Singh

MLA Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ మారుతున్నారని, త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా విస్తృత ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ వార్తలను రాజాసింగ్ పలుసార్లు ఖండించారు. తాజాగా మరోసారి రాజాసింగ్ ఈ అంశంపై ప్రస్తావించారు. నేను సచ్చినా సెక్యులర్ పార్టీలకు వెళ్లను. నా ప్రాణం పోయినా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు పోను అంటూ స్పష్టం చేశారు.

Raja Singh : గోషామహల్ బీజేపీ అభ్యర్థి ఎవరో చెప్పేసిన రాజాసింగ్

తెలంగాణను హిందూ రాష్ట్రం చేయాలన్నదే నా లక్ష్యమని రాజాసింగ్ చెప్పారు. బీజేపీ నాకు టికెట్ ఇవ్వకుంటే.. రాజకీయాలు పక్కనపెట్టి నేను హిందూ రాష్ట్రంకోసం పని చేసుకుంటానని అన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ 115 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో గోషామహల్ నియోజకవర్గం లేదు. దీంతో రాజాసింగ్ కోసమే సీఎం కేసీఆర్ ఆ నియోజకవర్గంలో అభ్యర్ధిని ప్రకటించలేదని ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై రాజాసింగ్ స్పందించారు. గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉంది.. అందుకే పెండింగ్‌లో పెట్టారు. దారుసలామ్ నుంచి గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారంటూ రాజాసింగ్ ఎద్దేవా చేశారు.

Amit Shah: తెలంగాణలో ఈ సారి సీఎం అయ్యేది కేసీఆర్ కాదు, కేటీఆర్ కాదు..ఆయనే..: అమిత్ షా

బీజేపీ అధిష్టానం నాపై సానుకూలంగా ఉంది. సరైన సమయం చూసి నాపై సస్పెన్షన్‌వేటు ఎత్తివేస్తారని రాజాసింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం రాకపోతే.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. అంతేకానీ.. ఇండిపెండెంట్‌గా, వేరే పార్టీల నుంచి పోటీ చేయనని రాజాసింగ్ స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు