Komatireddy Venkata Reddy : ప్రభుత్వం ఆ పని చేస్తే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు నెరవేరుస్తామని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నెరవేరుస్తాం. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వం లోనుంచి వెళ్ళిపోతాం.

Komatireddy Venkata Reddy

Komatireddy Venkata Reddy..BRS Govt : సీఎం కేసీఆర్ వైరల్ ఫీవర్ నుంచి కోలుకోవాలి అంటూ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆకాంక్షించారు. అదే సమయంలో తెలంగాణలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉందని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. సీఎం కేసీఆర్ జ్వరంతో..ఉంటే మంత్రి కేటీఆర్, హరీష్ లు ఎందుకు దీనిపై సమీక్ష చేయడం లేదు..? అని ప్రశ్నించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఉన్న లేనట్లేనని ఆయనకు సబ్జెక్టు లేదు అంటూ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ నేతలు టికెట్లు అమ్ముకుంటున్నాని..రూ.10 కోట్లకు టికెట్ లు అమ్ముకుంటున్నారంటు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు సరికాదని అవన్నీ పనికి మాలిన మాటలు అంటూ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను అని అన్నారు. ఈ రోజు వరి పంట కోతకు వస్తుంది.. కరెంట్ లేక పొలాలు ఎండిపోతున్నాయని ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న రైతుల్ని ఆదుకోవాలని సూచించారు.

Asian Games : ఆసియా క్రీడల్లో రజతం సాధించిన ఇషా సింగ్, తెలంగాణ బిడ్డ ఘనత అంటూ సీఎం కేసీఆర్ అభినందనలు

ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా.. కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.Tspsc పూర్తి వైపల్యం చెందిందని విమర్శించారు. నిర్వహణ చేతకాకే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.కాంగ్రెస్ వచ్చాక.. పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ 6 హామీలు ఇచ్చిందని వాటిని నెరవేరుస్తామని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నెరవేరుస్తామని తెలిపారు.ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మాలాంటి వాళ్లం ప్రభుత్వం లోనుంచి వెళ్ళిపోతాం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లాగా దుబారా ఖర్చులు చేయకుండా నిధుల్ని పొదుపుగా ఖర్చు పెడతామని అన్నారు. కేసీఆర్ దళితులకు 10 లక్షలు ఇస్తామన్నారు..అందరికి ఇచ్చే సరికి ఎంత టైం పడుతుంది…? అని ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

 

ట్రెండింగ్ వార్తలు