MAA : తెలంగాణ డీజీపీకి ‘మా’ ఫిర్యాదు.. ట్రోల్ చేసే వాళ్ళు టెర్రరిస్టులతో సమానం

సోష‌ల్ మీడియాలో న‌టీన‌టుల‌పై వ‌స్తున్న ట్రోల్స్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ తెలంగాణ డీజీపీకి మా(మూవీ ఆర్టిస్ట్) అసోసియేషన్ ఫిర్యాదు చేసింది.

Movie Artists Association complains to Telangana DGP over trolling

Movie Artist Association : సోష‌ల్ మీడియాలో న‌టీన‌టుల‌పై వ‌స్తున్న ట్రోల్స్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ తెలంగాణ డీజీపీకి మా(మూవీ ఆర్టిస్ట్) అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. శివబాలాజీ, రాజీవ్ కనకాల, సీనియర్ నటుడు శివకృష్ణలు మా అసోసియేషన్ తరపున డీజీపీని కలిశారు. ఐదు యూట్యూబ్ ఛాన‌ల్స్‌ను నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే స‌ద‌రు ఐదు యూట్యూబ్ ఛానళ్ళ పై చర్యలు తీసుకోవాలంటూ యూట్యూబ్ ప్రతినిధులకు ఫిర్యాదు చేసిన కాపీని అంద‌జేశారు.

200కు పైగా ట్రోల్స్ చేసే ఛానల్స్ ఉన్నాయ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 25 యూట్యూబ్ ఛాన‌ల్స్‌ టెర్మినేట్ చేసిన‌ట్లు చెప్పారు. దీని కోసం సైబర్ క్రైమ్ టీమ్‌ను పెట్టుకున్న‌ట్లు తెలిపారు. సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి కో ఆర్డినేషన్ కమిటి ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

Ari Movie : అనసూయ కూడా మైథాలజీ సినిమా.. అందులో కృష్ణుడి సీన్స్ గూస్ బంప్స్ అంట..

న‌టుడు శివ‌బాలాజీ మాట్లాడుతూ.. ట్రోల్ చేసే వాళ్ళు టెర్రరిస్టులతో సమానమ‌న్నాడు. లేడీ ఆర్టిస్టుల పై వస్తున్న ట్రోల్ చాలా దారుణంగా ఉన్నాయ‌ని, వీటి వ‌ల్ల‌ కుటుంబాలు చాలా బాధ పడుతున్నాయని చెప్పాడు. క్యారెక్టర్ ను కించ పరిచేలా ట్రోల్ చేస్తున్నారని, పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారని చెప్పాడు. ట్రోల్స్ చేసేవి 200పైగా ఛానల్స్ ఉన్నాయి. ఇప్పటికే 25 ఛానల్స్ ఇప్పటికే డౌన్ చేసాము, మీరు కూడా అందులో ఉంటే ఆ లింక్ లు తీసి వెయ్యండన్నారు. ఈ అంశంపై డీజీపీ సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలిపారు.

రాజీవ్ క‌న‌కాల మాట్లాడుతూ.. ట్రోల్స్ న‌వ్వుకునే విధంగా ఉండాలి గానీ ఉడికించేలా ఉండ‌కూడ‌ద‌ని అన్నాడు. కుటుంబ స‌భ్యుల మీద కూడా ట్రోల్ చేయ‌డం దారుణ‌మ‌న్నాడు. ఇక మీద‌ట న‌టీన‌టుల మీద ట్రోల్ చేస్తే స‌హించేది లేద‌న్నాడు.

Kalki – Prabhas : బుక్ మై షోలో ‘కల్కి’ సినిమాతో సరికొత్త రికార్డ్ సృష్టించిన ప్రభాస్.. ఏ హీరోకి ఈ రికార్డ్ లేదుగా..

ట్రెండింగ్ వార్తలు