Ari Movie : అనసూయ కూడా మైథాలజీ సినిమా.. అందులో కృష్ణుడి సీన్స్ గూస్ బంప్స్ అంట..

ఇటీవల మైథాలజీ కాన్సెప్ట్ తో లేదా సినిమాలో దేవుడికి లింక్ పెట్టి కొత్తగా చూపిస్తున్న సంగతి తెలిసిందే.

Ari Movie : అనసూయ కూడా మైథాలజీ సినిమా.. అందులో కృష్ణుడి సీన్స్ గూస్ బంప్స్ అంట..

Anasuya Ari Movie having Lord Krishna Climax Talk goes Viral

Updated On : July 18, 2024 / 2:42 PM IST

Ari Movie : పేపర్ బాయ్ మూవీ డైరెక్టర్ జయశంకర్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన సినిమా ‘అరి’. ఈ సినిమాలో సుమన్, ఆమని, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, అనసూయ, సురభి ప్రభావతి, వైవా హర్ష ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్, గ్లింప్స్ రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు.

అయితే ఇటీవల మైథాలజీ కాన్సెప్ట్ తో లేదా సినిమాలో దేవుడికి లింక్ పెట్టి కొత్తగా చూపిస్తున్న సంగతి తెలిసిందే. అలా వస్తున్న సినిమాలు అన్ని హిట్ అవుతున్నాయి. అఖండ 2, ఇటీవల వచ్చిన హనుమాన్, రీసెంట్ గా వచ్చిన కల్కి సినిమాలో కూడా దేవుడి కాన్సెప్ట్స్ జత చేసి దేవుడ్ని చూపించే సన్నివేశాలని కూడా అద్భుతంగా తెరకెక్కించారు. హనుమాన్ లో హనుమంతుడు, కల్కిలో కృష్ణుడు సీన్స్ చూస్తే గూస్ బంప్స్ ఎలా వచ్చాయో అదే కోవలో ఇప్పుడు అరి సినిమా రాబోతుంది.

Also See : అదిరిపోయే మరో శివుడి పాట విన్నారా? అశ్విన్ బాబు సినిమా నుంచి..

అరిష‌డ్వ‌ర్గాలలోని కామ‌, క్రోధ‌, లోభ‌, మొహ‌, మ‌ద‌, మాత్స‌ర్యాల చుట్టూ తిరుగుతూ అరి సినిమా ఉండబోతుంది. అయితే ఇందులో కూడా కృష్ణుడిదే మెయిన్ పాత్ర అట. ఈ మూవీ చివర్లో కృష్ణుడ్ని చూపించే సీన్‌కు గూస్ బంప్స్ గ్యారెంటీ అని టాక్ నడుస్తుంది. దీంతో ఈ సినిమాపై కూడా అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమాలో కృష్ణుడిగా ఎవరు నటిస్తున్నారు అని చర్చ కూడా మొదలైంది.