Mahesh Babu : మహేశ్‌బాబుకు మళ్లీ పెళ్లి చేస్తున్న ఫ్యాన్స్.. రీ రిలీజ్ ప్రమోషన్స్ అదిరిపోయాయిగా..
టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది.
- Thota Vamshi Kumar
- Published On : July 18, 2024 / 04:30 PM IST
Mahesh Babu classic movie murari Re Release on August 9th
Mahesh Babu – Murari Re Release : టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. హీరోల పుట్టిన రోజు, ప్రత్యేకమైన రోజులను పురస్కరించుకుని గతంలో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన సినిమాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని ఓ క్రేజీ సినిమా రీ రిలీజ్‌కు సిద్దమైంది.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన సినిమా మురారి. సోనాలి బింద్రే హీరోయిన్‌గా నటించగా లక్ష్మీ, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు లు కీలక పాత్రలను పోషించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అధ్బుతమైన సంగీతం అందించిన ఈ సినిమా 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేశ్ కెరీర్‌లోనే ఓ అద్భుతమైన చిత్రంగా నిలిచింది.
MAA : తెలంగాణ డీజీపీకి ‘మా’ ఫిర్యాదు.. ట్రోల్ చేసే వాళ్ళు టెర్రరిస్టులతో సమానం
ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టిన రోజు. ఈ క్రమంలో ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కాగా.. అభిమానులు ఈ రీరిలీజ్‌ను కొంచెం వినూత్నంగా ప్లాన్ చేశారు. ఘట్టమనేని వారి వివాహ ఆహ్వాన ప్రతీక అంటూ పెళ్లి కార్డుల రూపంలో డిజైన్ చేసి ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆహ్వాన పత్రికలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మహేశ్ బాబు దర్శక దీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మొదలు పెట్టేందుకు చిత్ర బృందం సిద్దమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
Ari Movie : అనసూయ కూడా మైథాలజీ సినిమా.. అందులో కృష్ణుడి సీన్స్ గూస్ బంప్స్ అంట..
