56 కేంద్రాల్లో డీఎస్సీ.. సమయం దాటాక వచ్చిన అభ్యర్థులను అనుమతించని సిబ్బంది

Telangana DSC examination: ఈ పరీక్షలను మొదటిసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. పరీక్ష రాసే ప్రతి అభ్యర్థి..

dsc

తెలంగాణలో నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు జరుగుతున్నాయి. సమయం అయిపోయాక వచ్చిన అభ్యర్థులను సిబ్బంది అనుమతించలేదు. మౌలాలిలోని ఐఓఎన్ సెంటర్ వద్ద నలుగురు డీఎస్సీ అభ్యర్థులు ఆలస్యంగా రాగా వారిని పరీక్షకు అనుమతించలేదు.

మొత్తం 11,062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 2,79,956గా ఉంది. బుధవారం సాయంత్రం వరకు 2,48,851 మంది విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఈ పరీక్షలను మొదటిసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. పరీక్ష రాసే ప్రతి అభ్యర్థి బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. పరీక్షకు 15 నిమిషాల ముందేగేట్లను మూసేశారు. గంటన్నర ముందు నుంచే సెంటర్లోకి అనుమతి ఇచ్చారు. వచ్చే నెల 5వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.

రోజుకు రెండు పరీక్షల చొప్పున ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, సాయంత్రం 2 గంటల నుండి 4.30 వరకు పరీక్షలు ఉంటాయి. ఇవాళ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, సోషల్ టీచర్స్‌కు పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడి ఉండకూడదని పోలీసులు చెప్పారు. డీఎస్సీ పరీక్షల ఫలితాలు విడుదల చేసే వేళ మెరిట్‌ జాబితాను జిల్లాల వారీగా ప్రకటిస్తారు. పోస్టుల నియామకాలు జిల్లా యూనిట్‌గా చేస్తారు.

Also Read: వినుకొండలో నడిరోడ్డుపై అతి దారుణం.. 144 సెక్షన్ అమలు

ట్రెండింగ్ వార్తలు