రైతు రుణమాఫీపై బ్యాంకర్ల సమావేశంలో కీలక సూచనలు చేసిన భట్టి విక్రమార్క

అనంతరం 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ నిధులను విడుదల చేస్తామని అన్నారు.

Bhatti Vikramarka

రైతు రుణమాఫీపై హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వం విడుదల చేసే రైతు రుణమాఫీ నిధులను వాటికే వినియోగించాలని చెప్పారు. ఇతర అప్పులకు ఎట్టి పరిస్థితుల్లో జమ చేసుకోవద్దని అన్నారు.

ఆగస్టు నెల దాటకముందే 31 వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కింద విడుదల చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు 11 లక్షలకు పైబడి రైతులకు 6000 కోట్ల రూపాయలకు పైబడి నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. అంతేగాక, ఈ నెలలోనే రెండోదఫా లక్షన్నర వరకు బకాయి ఉన్న రైతుల రుణాలకు నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

అనంతరం 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ నిధులను విడుదల చేస్తామని అన్నారు. రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ పథకం ద్వారా 31 వేల కోట్లు ఏ రాష్ట్రంలోనూ మాఫీ చేయలేదని చెప్పారు. అధికారంలోకి వచ్చే ముందు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేతగా తాను రైతు రుణమాఫీ గ్యారెంటీ కార్డు పై సంతకం చేసి ప్రచారంలోకి వెళ్లామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహమని చెప్పారు.

 

ట్రెండింగ్ వార్తలు